రిలీజ్ కి ముందే లాభాలు తెచ్చి పెట్టిన ఎమ్మెల్యే.!

ఇజం సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మూవీ ఎమ్మెల్యే. మంచి లక్షణాలున్న అబ్బాయి అనేది ట్యాగ్ లైన్. నిర్మాతగా నష్టాలను చవిచూసిన  కళ్యాణ్ రామ్ కి “జై లవకుశ” లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సారి హీరోగా నటించిన మూవీ కూడా లాభాలను తెచ్చిపెట్టిందని టాలీవుడ్ వర్గాల వారు తెలిపారు. రిలీజ్ కి ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇందులో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్నారు.

ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. కాజల్ మరింత గ్లామర్ గా కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే. ఓ వైపు నవ్వులు. మరో వైపు యాక్షన్. రెండూ సినిమాని హిట్ చేస్తాయని అనిపిస్తోంది. ఆ నమ్మకంతోనే పోటీ పడి సినిమా థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 4.2 కోట్లకు కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే  కాకుండా ఓవర్సీస్ లో 5 కోట్లకు అమ్ముడవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు కలుపుకొని 22 కోట్ల దగ్గర ప్రీ రీలీజ్ బిజినెస్ చేసినట్టు తెలిసింది. ఎక్కువ థియేటర్లలోనూ రిలీజ్ చేస్తున్నారు. సో కలక్షన్స్ కూడా భారీగానే వచ్చేటట్టు ఉందని ట్రేడ్ వర్గాల వారు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus