Obulamma song: ‘కొండపొలం’ సినిమా ముందేం పేరు పెట్టారో తెలుసా?

క్రిష్‌ సినిమా అంటేనే ఓ తెలియని ఫీలింగ్‌ కలుగుతుంది. అభిమానుల్ని తన స్టయిల్‌, టేకింగ్‌తో కట్టిపడేస్తారాయన. వాటికి కీరవాణి సంగీతం అదనపు సొబగు. ఒక్కోసారి దానికి కీరవాణి రాసిన పాట కూడా యాడ్‌ అవుతుంది. అలా క్రిష్‌ తాజా సినిమా ‘కొండపొలం’లో కీరవాణితో ‘ఓబులమ్మ…’ అనే పాట రాయించారు. ఇటీవల విడుదలైన ఆ పాటకు మంచి స్పందన వస్తోంది. మరి ఆ పాట కోసం కీరవాణి ఎంత కసరత్తు చేశారు, పాట ఎలా సిద్ధం చేశారో తెలుసా?

కర్నూలు జిల్లాలోని మాండలికంతో ‘ఓబులమ్మ…’ పాటను రాశారు కీరవాణి. ఈ సినిమాను ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన కొండపొలం ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలసిందే. అందుకే పాట రాసేటప్పుడ కీరవాణి ఆ నవల చదివారట. అందులో రచయిత వాడిన మాటలు తీసుకుంటూ… అదనంగా మరికొన్ని పదాలను జోడించి పాట రాశారట. రచయిత సన్నపు రెడ్డి… ఆ పాట విని ఓకే చేశాకే ముందుకెళ్లారట క్రిష్‌. ‘కొండపొలం’ వర్కింగ్‌ టైటిల్‌గా చాలా రోజుల క్రితమే బయటకు వచ్చింది.

తాజాగా దానిని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ లోపు చాలా రకాల పేర్లు… బయటికొచ్చాయి. అయితే అవేవీ కాకుండా క్రిష్‌ మరో పేరు అనుకున్నారట. అదే ‘వనవాసి’. అయితే ఈ పేరు విషయంలో కీరవాణి అంత ఆసక్తిగా లేరట. అదే విషయం క్రిష్‌కి చెప్పడంతో ‘కొండపొలం’ పేరు ఫిక్స్‌ చేశారట.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus