మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. మొన్నటికి మొన్న మోహన్ బాబు (Mohan Babu) మీడియా వారిపై దాడి చేశారు. దీనికి జర్నలిస్టులంతా ఏకపక్షంగా నిరసన తెలిపారు. మోహన్ బాబు జర్నలిస్టుకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి మోహన్ బాబు మీడియాకి క్షమాపణలు చెబుతూ ఆయన వెర్షన్లో ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. మోహన్ బాబు ఆడియో క్లిప్ ద్వారా మాట్లాడుతూ..”తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. గత 4 రోజుల నుండి జరుగుతున్నది మీ అందరికీ తెలుసు.
బహుశా సీఎంలకు కూడా తెలిసుండొచ్చు. నాకు అర్ధం కానిది ఏంటంటే .. ఫ్యామిలీ మేటర్స్ లో ఇతరుల జోక్యం చేసుకోవచ్చా..? ఆలోచించండి..? సెలబ్రిటీలపై ఉన్నవీలేనివీ చెబుతాంటారు. అందరూ ఆలోచించాలి. ప్రజలకు అన్నీ తెలుసు..! అయినా సరే… ఎవరి పని వారు చేసుకుంటారు. మీడియా, సోషల్ మీడియాలో విజువల్స్ అందరూ చూస్తున్నారు. రాత్రి నా కొడుకు మనోజ్… నా ఇంటి గేటు తీసుకుని వచ్చాడు. మీడియా సోదరులు.. నా ఇంటి ముందు 4 రోజుల నుండి ఉన్నారు. లైవ్ వ్యాన్స్ పెట్టుకుని మరీ ఉన్నారు. వాళ్లకు ముందే చెప్పాను..
‘ఇది నా ఫ్యామిలీ మేటర్..! నా సమస్యను నేను పరిష్కరించుకోగలను’ అని.! మీడియా సోదరులు నెగిటివ్‌గా చెబుతున్నారు. రాత్రులు గేటు తోస్కుని, పర్మిషన్ లేకుండా రావడం ఏంటి..? అందరూ మీడియా సోదరులా..? చేతిలో మైక్ పట్టుకుని, నాపై పగ ఉన్న వాళ్ళు వచ్చారా..? నాకు అనుమానం వేసింది. నేను రావద్దని చెప్పినా వచ్చారు. అయినా.. నమస్కారం పెట్టాను. మైక్ తీసుకువచ్చి నోట్లో పెట్టారు. కంటి కింద తగిలింది..ఆ టైంలో నా కన్ను పోయేది.
‘చీకట్లో గొడవ జరిగింది. దెబ్బ తగిలింది’ అన్నారు. అతను కూడా నాకు సోదరుడులాంటివాడే..! అందుకే నేను చాలా బాధ పడ్డాను. అతని భార్య, పిల్లలు ఎంత బాధపడుంటారో నేను అర్ధం చేసుకోగలను. నేను సినిమాల్లో నటించగలను..కానీ బయట నటించలేను. నీతిగా, ధర్మంగా బతకాలన్నది నా ధర్మం. గేటు బయట నేను కొట్టి ఉంటే.. అది నా తప్పు.. అప్పుడు నన్ను అరెస్ట్ చేసినా తప్పులేదు. కానీ ఇంట్లోకి వచ్చి నా ప్రైవసీని ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు.
ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది.. నా కొడుక్కి నాకు. మా సమస్యని మేము పరిష్కరించుకుంటాం..!మాకు బయటి వ్యక్తులు అవసరం లేదు. కట్టుబట్టలతో చెన్నై వెళ్లాను.. కష్టపడ్డాను. 25 శాతం ఫ్రీ సీట్లు ఇచ్చి.. విద్యాసంస్థలు నడుపుతున్నాను. ప్రజా ప్రతినిధులారా.. అభిమానులారా..? ఆలోచించండి. కొట్టింది తప్పే.. కానీ ఏ సందర్భంలో కొట్టాననేది ఆలోచించండి. ఇంట్లోకి వచ్చి దూరితే.. కోపం రాదా..? చెప్పండి..! మీకు టీవీలు ఉన్నాయి.. మాకు టీవీలు లేవు.. రేపు పెట్టొచ్చు..! అతనికి దెబ్బ తగిలింది..
అందుకు నాకు బాధేసింది. అయితే అతను నిజంగా జర్నలిస్టా కాదా? అనేది నాకు ఎలా తెలుస్తుంది..? యే ఛానల్..? అనేది నేను చూడలేదు. ఏకపక్ష నిర్ణయం ఏంటి..? ప్రజల్లారా ఆలోచించండి..? నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం న్యాయమా..? మీరే ఒక్కసారి ఆలోచించండి..” అంటూ చెప్పుకొచ్చాడు.
అంతా బాగానే ఉంది. మోహన్ బాబు చెప్పింది కరెక్టే..! పర్మిషన్ లేకుండా గేటు దాటి లోపలికి వెళ్ళకూడదు. కానీ..లోపలి తీసుకెళ్లింది ఆయన కొడుకు మనోజ్(Manchu Manoj) . కాబట్టి.. మీడియా వాళ్ళది పూర్తిస్థాయిలో తప్పు అనడానికి లేదు. ఇదిలా ఉంటే.. ‘నోట్లో మైక్ పెడితే.. కంటికి ఎలా తగులుతుంది?’ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది మోహన్ బాబు పై సెటైర్లు వేస్తున్నారు.
— Mohan Babu M (@themohanbabu) December 13, 2024