మోహన్ బాబుకి టికెట్ దొరకలేదట!

తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల్లో ఒకరైన మోహన్ బాబుకి ఒక సినిమా టికెట్స్ దొరకలేదంట. ఇంతకీ ఏ సినిమా టికెట్స్ అనుకుంటున్నారా..? తన కుమారుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘ఈడోరకం ఆడో రకం’ సినిమాను అభిమానులతో కలిసి థియేటర్ లో చూడాలని ప్లాన్ చేసుకున్నారు మోహన్ బాబు.

అయితే తను అనుకున్న సమయానికి టికెట్స్ దొరకకపోవడంతో ఈ బాధ చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. శుక్రవారం సినిమా చూడాలనుకున్న మోహన్ బాబుకి టికెట్స్ దొరకపోవడంతో నిర్మాత అనిల్ సుంకరతో శనివారం నాటికి టికెట్స్ తెప్పించుకున్నారట. అయితే శనివారం రోజు కూడా తను అనుకున్నన్నీ టికెట్స్ దొరకలేదని చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus