అమితాబ్ కోడలితో జతకడుతున్న మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగానే కాకుండా విలన్ గానూ, విలక్షణ నటుడుగానూ కూడా నటిస్తూ మరింత క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ‘గాయిత్రి’ ‘మహానటి’ చిత్రాలలో కూడా ఇదే తరహా నటనతో అలరించాడు. కాలికి చిన్న సర్జరీ కావడంతో కొంత విరామం తీసుకుని ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఏకంగా ఓ భారీ హిస్టారికల్ సినిమాలో నటించాడానికి రెడీ అయ్యారు మోహన్ బాబు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించే హిస్టారికల్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నారు మోహన్ బాబు.

ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు భార్యగా బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ నటించబోతుందట. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ఓ తమిళ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ నందిని అనే పాత్ర పోషించనుందట. ఈ పాత్ర రాజ్యాధికారం మీద మక్కువతో ద్రోహానికి పాల్పడేదిగా ఉంటుందని తెలుస్తుంది. ఓ విధంగా ఈమెది నెగటివ్ రోల్ అన మాట. ‘మద్రాస్ టాకీస్’ ‘రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్’ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతిలు వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus