Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు
- September 25, 2026 / 11:42 PM ISTByPhani Kumar
‘ది ప్యారడైజ్’ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. మొన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. 2వ రోజు కూడా వసూళ్లు బాగున్నాయి. సొ వీకెండ్ వరకు ఢోకా లేనట్టే..! నాని కంటెంట్ పై జనాల్లో ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవాలి. ఆ విషయాలు పక్కన పెట్టేసి.. ‘ది ప్యారడైజ్’ సినిమాలో హైలెట్స్ లేవా అంటే.. డౌట్ లేకుండా పుష్కలంగా ఉన్నాయి అనే ఆన్సర్ ఇవ్వొచ్చు.
Mohan Babu

నాని నటన, గెటప్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. అలాగే ప్రియదర్శి పాత్ర సర్ప్రైజింగ్ గా అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా మోహన్ బాబు (Mohan Babu) పాత్ర ఈ సినిమాకి హైలెట్. షికంజ మాలిక్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశారు మోహన్ బాబు. టైటిల్ కార్డ్స్ లో కూడా మొదట మోహన్ బాబు పేరే పడుతుంది. అలాగే మోహన్ బాబు ఇంట్రో సీన్, అక్కడ గంభీరంగా ఆయన పలికే డైలాగులు ‘వావ్ ఫేక్టర్’ అని చెప్పాలి.
మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్, అతని పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ను జెంజీలకి ‘ది ప్యారడైజ్’ ద్వారా తెలిసేలా చేశాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. కాకపోతే ప్రమోషన్స్ లో మోహన్ బాబు కనిపించకపోవడంతో చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు. ‘ది ప్యారడైజ్’ కోసం రూ.5 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు మోహన్ బాబు. ఇది పెద్ద మొత్తమే..! పైగా హీరో నాని కంటే ముందుగా తన పేరే టైటిల్ కార్డ్స్ లో వేయాలి అనే కండిషన్ కూడా పెట్టారట.
అలాంటప్పుడు ప్రమోషన్స్ కి వచ్చి పుష్ చేస్తే సినిమాకి మరింత మైలేజ్ వస్తుంది కదా. ఈ శనివారం నాడు నిర్వహించే ‘ది ప్యారడైజ్’ సక్సెస్ మీట్..కి మోహన్ బాబు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చూడాలి మరి..!
హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?










