మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో చిత్రం తెరకెక్కనుంది. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి చిత్రాలు సూపర్ హిట్ ఫలితాల్ని అందించినవి ఏమీ కావు కానీ… కొత్త మహేష్ బాబుని పరిచయం చేసి అతని ఇమేజ్ డబుల్ అవ్వడంల్లో సహాయపడ్డాయి. అయితే ఈసారి చేయబోయే చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఇద్దరూ భావిస్తున్నారు. మహేష్ బాబుకి కానీ త్రివిక్రమ్ కు కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈసారి వాళ్ళనే టార్గెట్ చేస్తూ కథని రెడీ చేసుకున్నారని తెలుస్తుంది.
ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఉంది. చిరంజీవి ‘మంత్రి గారి వియ్యంకుడు’ సినిమా కథని పోలి ఉంటుందని భోగట్టా. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా ‘పెళ్ళిసందD’ బ్యూటీ శ్రీలీల కూడా ఇందులో భాగం కానుంది.అంతేకాదు ఈ చిత్రంలో ఓ ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. దాని కోసం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ను ఎంపిక చేసుకున్నారట.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారట. మహేష్ కు మోహన్ లాల్ కు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఓ రేంజ్లో ఉండేలా త్రివిక్రమ్ కష్టపడుతున్నాడట. ఇక మహేష్ 28 కోసం మోహన్ లాల్ కు భారీ పారితోషికం అందినట్టు వినికిడి. అంతేకాకుండా ఈ చిత్రానికి స్వయంగా మోహన్ లాల్ ఓన్ డబ్బింగ్ చెప్పుకునే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 2016 లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ లో మోహన్ లాల్ నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!