Vijay Deverakonda: అప్పుడు యాస నప్పలేదు.. ఇప్పుడు జాగ్రత్తపడతారా? లేకపోతే రిస్క్‌ చేస్తున్నట్లే?

ఓ సినిమాలో హీరో పాత్ర పండింది అంటే లుక్‌, వాక్‌, టాక్‌.. ఇలా అన్నీ క్లిక్‌ అవ్వాలి. ఇందులో ఏ ఒక్కటి సెట్‌ కాకపోయినా ఆ పాత్రకు అంత పేరు రాదు. తద్వారా సినిమా కూడా ఇబ్బందుల్లో పడుతుంది. గతంలో చాలాసినిమాలకు ఇలా జరిగింది. కొన్నిసార్లు ఇందులో ఏదో ఒకటి మిస్‌ అయినా ఇతర అంశాలతో సినిమా ముందుకెళ్లిపోతుంది. ఒక్కోసారి ఇండస్ట్రీ హిట్‌లు కూడా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. గతంలో యాస్‌ మార్చడానికి లేదంటే యాస మార్చకుండా తాను ఇబ్బందిపడి, ప్రేక్షకుల్ని ఇబ్బంది పడిన ఓ హీరో కొత్తగా యాస మారుస్తాడు అనే మాట రావడమే.

Vijay Deverakonda

‘రౌడీ జనార్ధన’ అంటూ విజయ్‌ దేవరకొండ వచ్చే ఏడాది ఈ టైమ్‌కి రానున్నాడు. రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయడానికి హీరో లేని సినిమా టీమ్‌ హాజరైంది. ఈ క్రమంలో ఈ సినిమాలో విజయ్‌ పడుతున్న కష్టం గురించి దిల్‌ రాజు చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో విజయ్‌ గోదావరి యాసలో మాట్లాడతాడు అని కూడా చెప్పారు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు గతంలోకి వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో రెండుసార్లు యాస కారణంగా విజయ్‌ ఇబ్బందిపడ్డాడు, ఇబ్బంది పెట్టాడు.

విజయ్‌ దేవరకొండకు తొలి బ్లాక్‌బస్టర్ హిట్‌ అంటే.. ‘గీత గోవిందం’. ఈ సినిమాలో విజయ్‌ గోదావరి జిల్లాల కుర్రాడిలా కనిపిస్తాడు. అయితే ఎక్కడా ఆ యాసలో మాట్లాడినట్లు అనిపించదు. ఆ సినిమా సాధించి విజయం నేపథ్యంలో ఈ పాయింట్‌ని పెద్దగా ఎవరూ పట్టించుకున్నది లేదు. అయితే ఈ ఇబ్బందైతే ఉంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అర్జునుడిగా వచ్చి.. కాసేపు కనిపిస్తాడు. ఈ క్రమంలో ఆయన సంభాషణలు సినిమాకు దూరంగా ఉంటాయి. పౌరాణిక పాత్ర వేసి అలా మాట్లాడకపోవడమే దానికి కారణం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘రౌడీ జనార్ధన’లో గోదావరి యాసను ఎలా చెబుతాడో అనే ఆసక్తి మొదలైంది.

ఆ తెలుగు హాలీవుడ్‌ నటి మళ్లీ టాలీవుడ్‌కి వచ్చింది.. ఎవరో తెలుసా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus