టాలీవుడ్ అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా డెబ్యూ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చింది. మొదట ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వం వహిస్తాడు అనుకున్నారు. ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్టే చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ప్రశాంత్ వర్మకి నెక్స్ట్ లెవెల్ ఆఫర్స్ వచ్చాయి.
రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ప్రాజెక్టు చేస్తాడు అని ప్రకటన వచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు నుండి రణ్వీర్ సింగ్ తప్పుకుంటున్నట్టు తెలిపారు. అందుకు కారణాలు ఏంటి అనేది తర్వాత సంగతి. అయినప్పటికీ ‘అధీర’ ప్రాజెక్టుని ప్రశాంత్ వర్మ టేకప్ చేయలేదు. కథ , స్క్రీన్ ప్లే మాత్రమే ప్రశాంత్ వర్మ అందిస్తారని ప్రచారం జరిగింది.
ఇందులో భాగంగా ‘నా సామి రంగ’ ఫేమ్ విజయ్ బెన్నిని దర్శకుడిగా తీసుకున్నారు. కొంతకాలం ఇతను ప్రశాంత్ వర్మతో (Prasanth Varma) ట్రావెల్ చేసిన అనంతరం తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత సత్యదేవ్ తో ‘తిమ్మరుసు’ అనే సినిమా తీసిన శరణ్ కొప్పిశెట్టికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు అని సమాచారం. కళ్యాణ్ కొత్త హీరో కాబట్టి.. ఓ సీనియర్ హీరో ఉంటే మార్కెటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అని ప్రశాంత్ వర్మ అభిప్రాయపడ్డాడట.
అందుకే మోహన్ లాల్ (Mohanlal) ను సంప్రదిస్తున్నారట. కానీ మోహన్ లాల్ నుండి ఇంకా ఏ రెస్పాన్స్ రాలేదని వినికిడి. ఒకవేళ మోహన్ లాల్ నో చెబితే.. టాలీవుడ్ సీనియర్ హీరోని ఎంపిక చేసుకోవాలని టీం భావిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.