Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth).. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తక్కువ టైంలోనే తెలుగులో కూడా పాపులర్ అయిపోయింది. ‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ సినిమాలో ఈమె లుక్స్ చూసి తెలుగు యువత ఫిదా అయిపోయింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ రుక్మిణీ మాత్రం చాలా మందికి క్రష్ అయిపోయింది. తెలుగులో ఆమెకు భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ పై ఆసక్తి పెరగడానికి కూడా అదే కారణం.

Rukmini Vasanth

అయితే నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతోనే రుక్మిణీ వసంత్ టాలీవుడ్ డెబ్యూ ఇవ్వాలి. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం.. తర్వాత ఆమె కన్నడలో చేసిన సినిమాలు, తమిళంలో చేసిన సినిమాలు రిలీజ్ అవ్వడం.. అవి ప్లాప్ అవ్వడంతో రుక్మిణీ ఇంకా ఇక్కడ స్టార్ కాలేదు.

అయినప్పటికీ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) లో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ఈ సినిమా కోసం ఆమె రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ బడా ప్రాజెక్టు కోసం రుక్మిణీ వసంత్ రూ.5 కోట్ల నుండి రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేసిందట.

ఆమె టీం, మేకప్ వంటి వాళ్ళ ఖర్చులు అన్నీ కలుపుకుని అనమాట. అందుకు దర్శక నిర్మాతలు కూడా సంతోషంగా ఓకే చెప్పేశారట. ఈ సినిమా కనుక హిట్ అయితే రుక్మిణీ రేంజ్ టాలీవుడ్లో మరింత పెరగడం ఖాయం అనే చెప్పాలి.

‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus