మోహన్ లాల్ (Mohanlal) తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బరోజ్ 3డీ’ (Barroz) చిత్రం, భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపర్చింది. డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మోహన్ లాల్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ‘గార్డియన్ ఆఫ్ డిగామా ట్రెజర్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, మల్టీడైమెన్షనల్ కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావించారు. కానీ ఫలితం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా నిలిచింది. సినిమా నిర్మాణానికి అశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోనీ పెరంబూర్ (Antony Perumbavoor) ఏకంగా రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేశారు.
అత్యున్నత స్థాయి సెట్లు, విదేశీ లొకేషన్లు, పోస్ట్ ప్రొడక్షన్ కోసం అంతర్జాతీయ స్థాయిలో చేసిన ప్రయత్నాలు వృథాగా పోయాయి. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రతీ చిన్న విషయానికీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినా, ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. బిజినెస్ పరంగా చూస్తే, సినిమా విడుదల తర్వాత లాంగ్ రన్‌లో కేవలం రూ.20 కోట్ల రాబడినే సాధించిందని సమాచారం.
ఇది మోహన్ లాల్ కెరీర్‌లోనే అత్యంత నిరాశజనకమైన ఫలితంగా చెప్పుకోవచ్చు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమా, అక్కడ కూడా సరిగ్గా ఆదరణ పొందలేదు. రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టి కనీసం 50 శాతం కూడా రాబట్టలేకపోవడం సినిమా వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
సినిమాపై తొలిరోజు నుంచే నెగటివ్ టాక్ రావడం, రివ్యూలు నెగెటివ్‌గా మారడం సినిమాను మరింత కష్టాల్లో పడేసింది. కొన్ని వర్గాలు సినిమా కంటెంట్‌ను చూసి గట్టి విమర్శలు చేయగా, మరికొంత మంది మలయాళ పరిశ్రమలో కావాలనే ఈ సినిమాను కిల్ చేశాయని అభిప్రాయపడ్డారు. మొదటి షో తర్వాతే ఇలా వ్యతిరేక స్పందన రావడంతౌ, డైరెక్టర్ మోహన్ లాల్‌కు పెద్ద ఎదురు దెబ్బగా మారింది.