Mokshagna: వైరల్ అవుతున్న మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్స్.. శుభవార్త చెబుతారా?

  • February 18, 2024 / 07:31 PM IST

నందమూరి హీరో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత నాలుగేళ్లుగా చర్చ జరుగుతోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ గురించి, కథ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. 2024 సంవత్సరంలో మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. మరోవైపు మోక్షజ్ఞకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ తాజాగా స్లిమ్ లుక్ లో ఫిట్ గా కనిపిస్తూ నందమూరి అభిమానులను ఎంతగానో మెప్పిస్తున్నారు.

హీరో కటౌట్ గా మారిపోయిన మోక్షజ్ఞ త్వరలోనే తన సినీ ఎంట్రీకి సంబంధించిన శుభవార్త చెప్పడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారని మ్యాన్లీ లుక్ లో మోక్షజ్ఞ ఫిదా అయ్యేలా ఉన్నారని ఫ్యాన్స్ చెబుతుండటం గమనార్హం. మోక్షజ్ఞ గడ్డం పెంచి కొత్త లుక్ లో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ల జాబితాలో బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి మరి కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య, మోక్షజ్ఞ కాంబోలో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉండనుందని ప్రచారం జరుగుతోంది. అఖండ2 సినిమాలో మోక్షజ్ఞ కనిపిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా త్వరలో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి క్లారిటీ రానుంది. అక్టోబర్ నెల 6వ తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు కాగా ఆరోజే మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి క్లారిటీ రానుంది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞకు ప్రముఖ బ్యానర్ల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. మోక్షజ్ఞ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. మోక్షజ్ఞ మాస్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus