Mokshagna Teja: నందమూరి ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్..!

  • November 27, 2021 / 07:00 PM IST

చిరంజీవి, నాగార్జున కొడుకులు ఆల్రెడీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయం పై ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తున్నాడు బాలయ్య. అయితే ‘ఆదిత్య 369’ సీక్వెల్ ను మోక్షజ్ఞతో తెరకెక్కిస్తానని… కుదిరితే దానికి నేనే దర్శకత్వం వహిస్తానని ఇటీవల బాలయ్య తెలియజేసాడు. కానీ తర్వాత ఎప్పటిలాగే క్రిష్, బోయపాటి పేర్లు వినిపిస్తున్నాయి.

సరే ఈ విషయాల్ని పక్కన పెడితే.. మోక్షజ్ఞ ను మరికొన్ని రోజుల్లోనే లాంచ్ చేయబోతున్నాడట బాలయ్య. అది కూడా ‘ఆహా’ వారి హయాంలో..! మేటర్ ఏంటంటే… బాలకృష్ణ ప్రస్తుతం ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు. దీని ఫైనల్ ఎపిసోడ్లో మోక్షజ్ఞని ప్రేక్షకులకి పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల ‘అన్స్టాపబుల్’ షూటింగ్ స్పాట్లో మోక్షజ్ఞ దర్శనమిచ్చాడు. దాంతో ఇది నిజమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అదే ఎపిసోడ్లో మోక్షజ్ఞ మొదటి సినిమా ప్లానింగ్స్ ను కూడా బాలయ్య తెలిపే అవకాశం ఉందట.ఒక్క సినిమాలో కూడా నటించకుండానే మోక్షజ్ఞకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతని పుట్టినరోజు నాడు నందమూరి అభిమానులు ప్రత్యేకంగా వచ్చి అతని బర్త్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus