బిగ్ బాస్4: మోనాల్ చెప్పిన సీక్రెట్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిన తర్వాత అఖిల్ – మోనాల్ మద్యలో అసలు ఏం జరుగుతోంది అనే ఆరాటమే ప్రేక్షకుల్లో ఎక్కువగా కనిపించింది. లాస్ట్ వీక్ పునర్నవి – రాహుల్ మధ్యలో ఎలాగైతే కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందో, ఇప్పుడు అదే సేమ్ టు సేమ్ వర్కౌట్ చేస్తున్నారు మోనాల్ అండ్ అఖిల్ ఇద్దరూ. హాట్ స్టార్ అన్ సీన్ లో ఇద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మోనాస్ సరదాగా ఆటపట్టిస్తూ.., నాకు పెళ్లికూడా అయ్యింది. కానీ మొగుడు పేరు గుజరాత్ సంస్కృతి ప్రకారం చెప్పకూడదు అని టీజ్ చేసింది. అంతేకాదు, నేను ప్రెగ్నెంట్ అని కూడా చెప్పింది. అయితే, అఖిల్ మాత్రం తనకి కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయాన్ని మోనాల్ కి క్లారిటీ ఇచ్చాడు. ఇండివెడ్యువల్ గా ఆలోచించే అమ్మాయి కావాలని, తనని బాగా చూస్కోకపోయినా తన పేరెంట్స్ పట్ల శ్రద్ధ చూపించాలని అన్నాడు. అంతేకాదు, చాలా జెన్యూన్ గా ఉండాలి, ప్లస్ నన్నెవరన్నా ఏమన్నా అంటే నా తరపున మాట్లాడే అమ్మాయి కావాలి అని చెప్పాడు.

దీనికి మోనాల్ నువ్వు బయటకి వెళ్లగానే రారా.. అంటూ ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి పిలుస్తుంది అని చెప్పింది. ఆ అమ్మాయి నాకు తెలుసా అంటూ అఖిల్ అడిగిన ప్రశ్నకి.. పరిచయం అక్కర్లేదు.. పరిచయం లేని అమ్మాయి అయితేనే బెటర్ అని సలహా ఇచ్చింది మోనాల్. ఇక నాతో పరిచయం లేని అమ్మాయి నాకు వద్దని, ఆ అమ్మాయిన చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోవాలని అప్పుడే నాకు నచ్చుతుందని క్లారిటీ ఇచ్చాడు అఖిల్.

అంతకుముందు మోనాల్ హౌస్ లో ఉన్న అమ్మాయి కాదు., బయటే మంచి అమ్మాయి వస్తుందని క్లారిటీ ఇచ్చింది. మోనాల్ సీక్రెట్ గా చెప్పిన విషయం ఇదే. మరి ఇదంతా మోనాల్ కి ఎందుకు చెప్పాడు అనేది అఖిల్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న ప్రశ్న. అదీ విషయం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus