బిగ్‌బాస్ ఇంటిలోకి వచ్చి… జీవితాన్ని జీవించడం నేర్చుకున్నవారు కొందరైతే, జీవితం అంటే తెలుసుకున్నవారు ఇంకొందరు. వీళ్లు కాకుండా ‘తెలుగు’ భాష నేర్చుకున్నవాళ్లూ ఉన్నారు. ఈ సీజన్‌లో ఆ పని మోనాల్ చేస్తోంది. మరి మోనాల్‌కు తెలుగు నేర్పించే గురువు ఎవరో తెలుసా? ఇంకెవరు ఈ ఏడాది బిగ్‌బాస్ షోలో ఎంటర్‌టైన్మెంట్‌ను తన భుజాన వేసుకుని నడిపిస్తున్న మన గంగవ్వ. మోనాల్‌కు తనదైన శైలిలో, తెలంగాణ మాండలికంలో గంగవ్వ తెలుగు నేర్పిస్తోంది. అయితే ఈ క్రమంలో నోయల్ గూండా అయ్యాడు.
బిగ్‌బాస్ హౌస్‌లో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండటానికి … మోనాల్ తెలుగు నేర్చుకునే పనిలో పడింది. గంగవ్వ, అఖిల్‌ను కూర్చోబెట్టుకుని తెలుగు పదాలు నేర్చుకుంటోంది. ప్రచ్చన్న అంటే ఏంటి అని అడిగి క్లాస్ స్టార్ట్ చేసింది మోనాల్.. తొలి ప్రశ్నకు అఖిల్ ‘నీ సమస్య ఏంటి’ అని అర్థం చెప్పాడు. మధ్యలో గంగవ్వ ‘ఓలాలు’ అని అంది. అదేంటి అని మోనాల్ అడిగితే ‘ఎవరు వాళ్లు ’ అనే అర్థం చెప్పాడు. ఇలా క్లాస్ జరుగుతున్నప్పుడు ‘గుండె’ గురించి వచ్చింది. దానిని మోనాల్‌ను గూండా అనుకుంది. మన దగ్గర గూండా నోయల్ అంటూ బిరుదిచ్చేసింది. దానికి నోయల్ కూడా చాలాహ్యాపీగా ఫీలై తీసేసుకున్నాడు. తర్వాత గుండె అంటే హార్ట్ అని తెలిసి నవ్వుకుంది. అందుకేనా నోయల్ అంత ఆనందించాడు అనుకుంది.
ఇంతలో గంగవ్వ కాళ్లకు చెప్పులు వేయని విషయం ప్రస్తావన వచ్చింది. ఎన్నో ఏళ్లుగా చెప్పులు వేసుకుకోకుండా.. ఎండలో సైతం నడుస్తా అని గంగవ్వ గురించి అఖిల్ చెప్పాడు. ఏది పాదాలు చూద్దాం అంటూ మోనాల్… గంగవ్వ పాదాల్ని మసాజ్ చేసింది. ఎంత స్టిఫ్‌గా ఉన్నాయో అంటూ తెగ తడిమి మురిసిపోయింది. ఈ సీన్ చూడటానికి భలే అనిపించింది. ఇదంతా అన్‌సీన్ వీడియోస్‌లో చూపించారు. టీవీలోనూ చూపించుంటే బాగుండేదేమో.