‘బిగ్ బాస్4’ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్. గతంలో ఈమె అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సుడిగాడు’ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ.. పెద్దగా పాపులర్ అవ్వలేదు కానీ ‘బిగ్ బాస్4’ ద్వారా బాగా పాపులర్ అయ్యింది.ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు.. నెటిజన్లు ఈమెను తెగ తిట్టిపోశారు. ఫ్యామిలీస్ చూసే షోలో ఆ హగ్గులు ముద్దులు ఏంటి అంటూ మండిపడ్డారు.
కానీ కుర్రకారుని మాత్రం ఈమె బాగా ఆకట్టుకుంది. యూత్ ఈమెకు గల క్రేజ్ కారణంగా టాలీవుడ్ నుండీ ఈమెకు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. ఇప్పటికే ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. బుల్లితెర పై కూడా ఈమె హవా ఎక్కువే నడుస్తుంది. దీంతో మోనాల్.. తన తల్లి పర్మిషన్తో ఓ కీలక నిర్ణయం తీసుకుందట. అలా అని అది ఈమె పెళ్లి కోసం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె అఖిల్ మరియు అభిజీత్ లతో సన్నిహితంగా ఉండడం వల్ల..
మరీ ముఖ్యంగా అఖిల్ తో ఈమె ప్రేమాయణం నడిపింది కాబట్టి.. అతనితో పెళ్లికి రెడీ అయ్యింది అని చాలా మంది అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే అంశం పై చాలా రోజుల నుండీ చర్చ జరుగుతుంది. కానీ అవేమీ నిజం కాదు. ప్రస్తుతానికైతే ఈమె తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వాలనుకుంటుందట. ప్రస్తుతం ఈమె మంచి ప్లాట్ కోసం వెతుకులాట మొదలుపెట్టిందని టాక్.