తొందర వద్దు…చిరు ట్విస్ట్

  • April 14, 2016 / 10:22 AM IST

మెగాస్టార్ చిరంజీవి!!! దాదాపుగా టాలీవుడ్ ను మహారాజులా శాసించిన హీరో. మెగా స్టార్ గా తన స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. అయితే అలాంటి టాప్ స్థానంలో ఉన్న మన చిరు అకస్మాత్తుగా శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే ‘ప్రజా రాజ్యం’ పేరుతో ఆయన సంధించిన రాజకీయ బాణం ప్రజలను మెప్పించక పోవడంతో పాపం ఫేల్యూర్ పాలిటీషియన్ గా చివరకు తన పార్టీను కొంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ కొంగ్రెస్ పార్టీ చ్యాప్టర్ ఆంధ్రలో క్లోస్ అయిపోవడంతో మళ్ళీ చిరు సినిమాలపై దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే, చిరు 150వ చిత్రంగా తమిళ్ ‘కత్తి’ సినిమాను తెరాకెకిస్తున్నట్లు తెలిసిందే. అయితే ఈ మధ్య పాపం మెగా ఫ్యామిలీ పరిస్థితి అంతంత మాత్రం ఉంది, ఫలితాలు చూస్తే, లోఫర్, బ్రూస్ లీ ఈ మద్య వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. దీనితో చిరు 150వ సినిమాపై అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇక మరో పక్క ఈ ప్రతిష్టాత్మక చిత్రం విషయంలో తెలుగు నేటివిటీకి చిరంజీవి స్టేటస్ కి తగ్గట్టుగా ఆయన పాత్రని, ఆయన గెటప్ ని తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు వినాయక్. ఇక కథ విషయంలో చిరంజీవి స్వయంగా చూస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. తొందరపడి ఏ స్టోరిను ఓకే చేయడంలేదు. బాగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను భారీ హిట్ గా నిలపాలి అని చిరు బాగా కష్టపడుతున్నట్లు సమాచారం. ఇక గెటప్ విషయానికి వస్తే….ఇటీవల చిరు గడ్డంతో ఫంక్షన్స్ కు అటెండ్ అవుతుండడంతో, ఇది ఆయన 150వ చిత్రం గెటప్ అనే వాదన బలంగా వినిపిస్తుంది. మరి ఎంతవరకూ చిరు ఆశ నెరవేరుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus