అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన రామ్ కామ్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘జీఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ..లు కలిసి నిర్మించగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. 2021 అక్టోబర్ 15న ఈ సినిమా విడుదల అయ్యింది. అప్పటివరకు అఖిల్ కి ఒక్క హిట్ కూడా లేదు.
అతనికి మొదటి హిట్ ఇచ్చింది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే చెప్పాలి. వాస్తవానికి మొదట ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దసరా హాలిడేస్ కలిసి రావడం.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఆదరించడంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
ఈ సందర్భంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.59 cr |
సీడెడ్ | 4.08 cr |
ఉత్తరాంధ్ర | 2.44 cr |
ఈస్ట్ | 1.25 cr |
వెస్ట్ | 1.03 cr |
గుంటూరు | 1.41 cr |
కృష్ణా | 1.14 cr |
నెల్లూరు | 0.87 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 19.81 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.52 cr |
ఓవర్సీస్ | 2.42 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 23.75 కోట్లు (షేర్) |
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం రూ.21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.23.75 కోట్ల షేర్ ను రాబట్టి…. రూ.2.75 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ గా నిలిచింది.