‘బాహుబలి’ తో పోలిస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ పై బజ్ పెద్దగా ఉండడం లేదు అని ‘ఆర్ ఆర్ ఆర్’ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే ఈ చిత్రం మొదలైనప్పటి నుండీ ఏదో ఓక ఆటంకాలు వస్తున్నాయి. పోనీలే.. ఆయ్యిందేదో అయిపొయింది. మొత్తానికి ‘ఆర్ ఆర్ ఆర్’ అంటే ‘రౌద్రం రణం రుథిరం’ అని పెద్ద హడావుడి లేకుండానే రెవీల్ చేసారు. నిన్న చరణ్ బర్త్ డే కానుకగా ఓ గ్లింప్స్ ను విడుదల చేసారు. ‘భీమ్ ఫర్ రామ రాజు’ పేరుతో విడుదల చేసిన ఈ గ్లింప్స్ కు… 24 గంటల్లో వచ్చిన లైక్స్ మరియు వ్యూస్ ను పరిశీలిస్తే…
తెలుగు గ్లింప్స్ : 7.09 మిలియన్ వ్యూస్ మరియు 494 K లైక్స్ ను నమోదు చేసింది
హిందీ గ్లింప్స్ : 5.10 మిలియన్ వ్యూస్ మరియు 268K లైక్స్ ను నమోదు చేసింది
కన్నడ గ్లింప్స్ : 1.40 మిలియన్ వ్యూస్ మరియు 99K లైక్స్ ను నమోదు చేసింది
తమిళ్ గ్లింప్స్ : 1.32 మిలియన్ వ్యూస్ మరియు 110K లైక్స్ ను నమోదు చేసింది
మలయాళం గ్లింప్స్ : 0.56 మిలియన్ వ్యూస్ మరియు 57K లైక్స్ ను నమోదు చేసింది.
మొత్తం అన్ని భాషలు కలుపుకుంటే… 15.47 మిలియన్ వ్యూస్ మరియు 1.03 మిలియన్ లైక్స్ ను నమోదు చేసింది ‘ఆర్ ఆర్ ఆర్’ గ్లింప్స్.
ఇక ఇప్పటి వరకూ అత్యధిక లైక్ లు నమోదు చేసిన టీజర్లను (ఒక్క తెలుగు వెర్షన్) పరిశీలిస్తే :
1) ఆర్. ఆర్.ఆర్ (భీమ్ ఫర్ రామరాజు) : 494 K లైక్స్
2) సాహో : 455K లైక్స్
3) అజ్ఞాతవాసి : 412K లైక్స్
4) అల వైకుంఠపురములో : 387K లైక్స్
5) సరిలేరు నీకెవ్వరు : 386 K లైక్స్
6) సైరా టీజర్ 2 : 352 K లైక్స్
7) అరవింద సమేత : 292 K లైక్స్
8) సైరా : 290 K లైక్స్
9) మహర్షి : 287 K లైక్స్
10) భరత్ అనే నేను : 282 K లైక్స్