ముప్పై ఏళ్ళ క్రితం 1987 లో పడమటి సంధ్య రాగం అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కథ నిమిత్తం ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకుంది. అప్పుడు అది విశేషం. ఆ తర్వాత ఇక్కడ జరిగే కథలైనప్పటికీ పాటల కోసం విదేశాలకు వెళ్లడం కామన్ అయిపోయింది. ఆ మార్క్ ని కూడా తెలుగు సినిమాలు దాటిపోయాయి. ఇక్కడ, అక్కడ కలబోసి నేటి రచయితలు కథలు సిద్ధం చేస్తున్నారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో కంటే విదేశాల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య తెరకెక్కిన సినిమాలపై ఫోకస్..
నిన్నుకోరినేచురల్ స్టార్ నాని నటించిన నిన్నుకోరి జులై 7 న రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ మొత్తం వైజాక్ లో జరగగా, సెకండాఫ్ మొత్తం అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, సాంటా మోనికాలో జరిగింది. అక్కడ అందమైన లొకేషన్లో ప్రేమ కథ గొప్పగా సాగింది.
నాన్నకు ప్రేమతోమాస్ లో విపరీత క్రేజ్ ఉన్న ఎన్టీఆర్.. ఆ ఇమేజ్ మొత్తాన్ని పక్కన పెట్టి చేసిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ మూవీ దాదాపు మొత్తం లండన్ లోనే చిత్రీకరణ జరుపుకుంది. అయినా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.
వన్ (నేనొక్కడినే )మహేష్ బాబు చిత్రాలు ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంటాయి. అందులో నేనొక్కడినే మాత్రం మరింత స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాను ఎక్కువగా లండన్, బెల్ఫాస్ట్, బ్యాంకాక్ తదితర దేశాల్లో తెరకెక్కించారు.
ఎలా చెప్పనుతరుణ్, శ్రియ జంటగా నటించిన మూవీ ఎలా చెప్పను. 2003 లో వచ్చిన ఈ సినిమా కొంత భాగం హైదరా బాద్ లో, మిగిలిన భాగం జర్మనీ లో చిత్రీకరణ జరుపుకుంది. తక్కువ బడ్జెట్ అయినప్పటికీ అక్కడ ఎక్కువ ప్రదేశాలను తెలుగు ఆడియన్స్ కి చిత్ర బృందం చూపించగలిగింది.
వెన్నెలరాజా, పార్వతి మెల్టన్, కిశోర్ తదితరులు నటించిన వెన్నెల అప్పట్లో సంచలనం సృష్టించింది. స్నేహితులు కలిసి నిర్మించిన ఈ మూవీ 90 శాతం అమెరికాలోని మిచిగాన్ లో షూట్ చేశారు. ఈ చిత్రంతో కిషోర్ కాస్త వెన్నెల కిషోర్ గా మారిపోయారు.
ఎవడిగోల వాడిదితెలుగు నేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఈవీవీ సత్యనారాయణ పూర్తిగా విదేశీ లొకేషన్లో చేసిన చిత్రం ఎవడిగోల వాడిది. హైదరాబాద్ లో మొదలయ్యే కథ కొద్ది నిముషాల్లోనే బ్యాంకాక్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడే చివరి వరకు సాగుతుంది.
దడనాగ చైతన్య, కాజల్ జంటగా నటించిన దడ స్టోరీ మొత్తం బ్యాంకాక్, థాయిలాండ్ లో సాగుతుంది. అందుకు అనుగుణంగా అక్కడి లొకేషన్స్ తో పాటు, పాటలకు జర్మనీకి వెళ్లారు. దాదాపు మొత్తం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అలరించలేకపోయింది.
బిల్లాప్రభాస్ స్టైల్ గా నటించిన చిత్రం బిల్లా. ఈ మూవీలో కొన్ని సీన్లు మాత్రమే వైజాక్ లో ఉంటాయి. మిగతా మొత్తం మలేషియాలోనే ఉంటాయి. అక్కడి రోడ్లపైన ఛేజింగ్.. ఫైట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఆరెంజ్ఓ రేంజ్ లో ప్రేమ కథను చూపించిన సినిమా ఆరెంజ్. రామ్ చరణ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మొత్తం ఆస్ట్రేలియాలోనే షూటింగ్ జరుపుకుంది. భారతీయ చిత్రాల్లో అత్యంత ఎక్కువభాగం ఆస్ట్రేలియాలోనే చిత్రీకరణ జరుపుకున్న సినిమాగా ఆరెంజ్ రికార్డుకెక్కింది.
మరో చరిత్ర కమల హాసన్ హిట్ మూవీ మరో చరిత్రను వరుణ్ సందేశ్ తో కొత్తగా తీశారు. ఈ సినిమాని అమెరికా, లాస్ వేగాస్, దుబాయ్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆ లొకేషన్స్ అందరికీ కనుల విందు చేసినప్పటికీ కథ మనసుకు హత్తుకోలేకపోయింది.
ఇద్దరుఅమ్మాయిలతోకొత్త అందాలను అన్వేషించడంలో పూరి జగన్నాథ్ చాలా ముందు ఉంటారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “ఇద్దరమ్మాయిలతో” సినిమా బార్సిలోనా, పారిస్, స్పెయిన్ లలో షూటింగ్ జరుపుకుంది. అంతేకాదు న్యూజీలాండ్, బ్యాంకాక్ లలో కొన్ని ఫైట్స్ కూడా చిత్రీకరించారు.
హార్ట్ ఎటాక్నితిన్, అదా శర్మ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం “హార్ట్ ఎటాక్” ముప్పై నిముషాలు గోవాలో సాగుతోంది. మిగిలిన సినిమా మొత్తం స్పెయిన్, రోమానియా లో జరుగుతుంది. లవ్ స్టోరీకి ఫారెన్ లొకేషన్లు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.