ఈ 12 జంటలు నెట్టింట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే.. అత్యధికంగా గ్లామర్ కు ప్రాధాన్యత ఇచ్చే ఇండస్ట్రీ. దాంతో పాటు రూమర్స్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో.. హిట్ పెయిర్ గా ముద్రపడిన హీరో, హీరోయిన్లు కనుక మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తుంటే.. వీళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ గాసిప్స్ మొదలైపోతాయి.ఈ విషయంలో ప్రభాస్, అనుష్క లను బెస్ట్ ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు. ‘#prabhanushka’ హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున రచ్చ చేశారు నెటిజన్లు. ఎన్నిసార్లు వీళ్ళు ఈ విషయం పై ఖండించినా ఈ రూమర్స్ ఆగలేదు. వీళ్ళు పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అన్నట్టే ఇప్పటికీ వార్తలు వస్తుంటాయి.

అయితే కేవలం వెండితెర పై కనిపించే వారి పైనే కాదు.. బుల్లితెర పై కనిపించే నటులకు కూడా ఇంతే..! సుడిగాలి సుధీర్, రష్మీ లను ఈ విషయంలో బెస్ట్ ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు. వీళ్ళ క్రేజ్ ను సదరు ఛానెల్స్ వారు ఉపయోగించుకుంటూ షోలు చెయ్యడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం.గాసిప్స్ తో ఫేమస్ అయిన నటీనటులు.. ఇంకా ఎంత మంది ఉన్నారో ఓ లుక్కేద్దాం రండి :

1) అనుపమ – క్రికెటర్ బుమ్రా :

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, క్రికెటర్ బుమ్రా మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు వచ్చాయి. అందుకు కారణం సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు ఫాలో అవ్వడమే కారణం. అంతేకాకుండా బుమ్రా ఫాలో అవుతున్న ఒకైక నటి అనుపమ అవ్వడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి.

2)శ్రీముఖి – రవి :

‘పటాస్’ షో టైములో వీళ్ళ పై వచ్చిన రూమర్స్ అన్నీ ఇన్నీ కాదు. గతేడాది రవి తన ఫ్యామిలీని పరిచయం చేస్తే కానీ ఈ రూమర్స్ ఆగలేదు.

3)రష్మీ – సుధీర్ :

‘జబర్దస్త్’ షో మొదలైనప్పటి నుండీ ఇప్పటి వరకూ వీళ్ళ పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆగలేదు.

4)వర్షిణి – హైపర్ ఆది :

ఈ మధ్యనే వీళ్ళ పై రూమర్స్ మొదలయ్యాయి. కానీ పెద్ద రేంజ్లో కాదు లెండి.

5)శ్రీముఖి – ప్రదీప్ :

మొన్ననే వీళ్లిద్దరి పెళ్లి కాన్సెప్ట్ తో ఓ స్పెషల్ షోని నిర్వహించారు. అప్పటి నుండీ వీళ్ళ పై రూమర్స్ మొదలయ్యాయి.

6)విష్ణు ప్రియ- సుధీర్ :

కొద్దిరోజుల నుండీ సుధీర్ – వర్షిణి ల పై కూడా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి.

7)రాజ్ తరుణ్ – హెబ్బా పటేల్ :

‘కుమారి 21ఎఫ్’ నుండీ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా వరకూ వీళ్ళ పై రూమర్స్ ఆగలేదు.

8)విజయ్ దేవరకొండ – బెల్జియం అమ్మాయి :

‘నోటా’ టైములో మొదలయ్యాయి. కొన్నాళ్ల తరువాత చల్లారిపోయాయి.

9)కాజల్ – బెల్లంకొండ శ్రీనివాస్ :

‘కవచం’ ‘సీత’ వంటి వరుస సినిమాల్లో నటించడం వల్ల బాగా క్లోజ్ అయ్యారు. అప్పటి నుండీ వీళ్ళు లవర్స్ అంటూ వార్తలు మొదలయ్యాయి.

10)అనిరుథ్ – ఆండ్రియా :

గతంలో లవర్స్ అట.. ఇప్పుడు విడిపోయారట..! ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా చెప్పింది.

11) ప్రభాస్ – అనుష్క :

‘బాహుబలి’ మొదలైనప్పటి నుండీ ఇప్పటివరకూ ‘#prabhanushka’ హవా నడుస్తూనే ఉంది.

12) రానా – త్రిషా : 

2017లో సింగర్ సుచిత్ర అకౌంట్ ద్వారా సుచి లీక్స్ పేరున విడుదలైన కొందరు తారల ప్రైవేట్ ఫోటోలు కోలీవుడ్ లో ప్రకంపనలు రేపాయి. వాటిలో రానా మరియు త్రిషా సన్నిహితంగా ఉన్న ఫోటో కూడా ఉంది. అప్పటికే త్రిషా, రానా మధ్య అఫైర్ నడుస్తోందన్న పుకారు ఉండగా ఆ లీక్డ్ ఫోటో తర్వాత మరింత బలపడింది. ఐతే త్రిష, రానా మేము స్నేహితులం మాత్రమే అని చెప్పుకున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus