జి.ఎస్.టి పై చిత్రపరిశ్రమ పోరాటం!

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “జి.ఎస్.టి” విధానం వల్ల ప్రజలకి ఎంత ఉపయోగముందో తెలియదు కానీ.. ఆ పద్ధతి వల్ల ఇబ్బందిపడుతూ, నష్టపోతున్నవారే ఎక్కువ. అందరికంటే ఎక్కువగా నష్టపోతుంది మాత్రం చిత్ర పరిశ్రమ. ఇటీవల తమిళ చిత్రం “మెర్సల్” విషయంలోనూ ఈ ట్యాక్స్ విషయమై పెద్ద చర్చ జరిగింది. రిలీజ్ కూడా దాదాపుగా ఆగిపోయినంత పనైంది. టికెట్ రేట్లు అమాంతం పెరగడమే అందుకు కారణం.

అయితే.. ఈ విషయమై చిత్రపరిశ్రమ ఆగ్రహించింది. అందుకే నవంబర్ లో బంద్ ను ప్రకటించనుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ చిత్రసీమలు కూడా ఈ బంద్ లో పాల్గొని తమ వ్యతిరేకత ప్రకటించనున్నాయి. అయితే.. చిత్రపరిశ్రమలు బంద్ ప్రకటించడం వరకూ బానే ఉంది కానీ.. పరిశ్రమను నమ్ముకొన్న కార్మికుల పరిస్థితి ఏంటీ అనేది కూడా పరిశ్రమ పెద్దలు ఆలోచిస్తే మంచిది. మరి ఈ వ్యతిరేకతను ప్రభుత్వం గుర్తించి పాజిటివ్ గా స్పందిస్తుందో లేక ఆగ్రహించి ప్రతీకార చర్యలు లాంటివి ఏమైనా చేపడుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus