అవకాశాలతో ఇబ్బంది పడుతున్న పాయల్ రాజ్ పుత్!

  • July 19, 2018 / 11:17 AM IST

నటీనటులు అవకాశాలు రావడం లేదని బాధపడుతుంటారు. ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సినిమా కష్టాలు అందరికీ తెలిసినవే. క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాత్రం అవకాశాలు వస్తున్నప్పటికీ బాధపడుతోంది. వస్తున్న ఆఫర్లతో ఇబ్బంది పడుతోంది. వింతగా ఉంది కదూ.. అవును నిజం. వివరాల్లోకి వెళితే…  యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 మూవీ గతవారం రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టిన ఈ సినిమా పది కోట్ల గ్రాస్ ని అధిగమించి దూసుకుపోతోంది. ఈ సినిమాని యువత, మాస్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. అందుకు ప్రధాన కారణం పాయల్ రాజ్ పుత్ అని సినీ విశ్లేషకులు చెప్పారు. ఆమె తన అందం, అభినయంతో కట్టిపడేస్తోంది.

ఇంకేముంది అందరూ అనుకున్నట్టు ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి.  ఆమె డేట్స్ కోసం తెలుగు దర్శకనిర్మాతలు క్యూ కట్టారు. పాయల్ రాజ్ పుత్ మాత్రం ఏ సినిమాకి సైన్ చేయలేకపోతోంది. కారణం ఏంటని అరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఆర్ఎక్స్ 100 లో పాయల్ పోషించింది నెగిటివ్ రోల్. తన ఆనందం కోసం హీరో ని మోసం చేసి, చంపించే పాత్ర అది. ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. అందుకే ఫిలిం మేకర్స్ తమ కథలో నెగటివ్ రోల్ ఉంటే.. దానిని పాయల్ పోషించాలని కోరుకుంటున్నారు. హీరోయిన్ గా ఎదగాలని కలలు కంటున్న ఆమెకు వ్యాంప్ పాత్రలు వస్తుండడంతో బాధపడుతోంది. ఆ సినిమాలు ఒప్పుకుంటే ఇక హీరోయిన్ గా ఎవరూ తీసుకోరని భావిస్తోంది. అందుకే తొందరపడి నెగటివ్ రోల్స్ ఒప్పుకోకూడదని ఫిక్స్ అయినట్లు తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus