సినిమా టైటిల్లో ఆకట్టుకున్న చిరంజీవి స్టైల్ లోగో

సినిమాల టైటిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల పేర్ల విషయంలో చాలా కసరత్తు జరిగేవి. పేరు ఒకే చేయడమే కాదు.. ఆ పేరు కథను ప్రతిబింభించేలా ఉండాలని శ్రద్ధ తీసుకునేవారు. కొన్నింటిలో అయితే చిరు లుక్ ని కూడా టైటిల్ ల్లోనే మిక్స్ చేశారు. ఆ విధంగా డిజైన్ తో వచ్చిన అనేక చిత్రాలు హిట్ సాధించాయి. అలా అభిమానులను ఆకర్షించిన చిరు స్టైల్ లోగో టైటిల్స్ పై ఫోకస్…

ఖైదీచిరంజీవి సినీ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఖైదీ. దీంతో చిరు కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. రివేంజ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ మూవీలో బ్లాక్ డ్రస్ యువతను బాగా ఆకర్షించింది. అదే లుక్ ని ఖైదీ టైటిల్ ల్లో ఉంచారు. ఇలా టైటిల్ ల్లో స్టిల్ ఉండేలా చిరు 1982 నుంచే మొదలెట్టారు.

జేబు దొంగకోదండరామి రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో అనేక హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో జేబు దొంగ అన్ని వర్గాల ప్రజలను అలరించింది. ఈ సినిమా టైటిల్లో చిరు ఒక ఆయుధం పట్టుకొని నిలబడి ఉంటారు. స్పష్టంగా చిరు మొహం కనిపించక పోయినా సస్పెన్స్ ని క్రియేట్ చేశారు.

యముడికి మొగుడుయమలోక అధిపతిని ముప్పుతిప్పలుపెట్టే పాత్రలో చిరు మెప్పించిన సినిమా యముడికి మొగుడు. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి ఆద్యంతం అలరించేలా తెరకెక్కించారు. ఈ మూవీ టైటిల్ లో చిరంజీవి ఒంటరిగా ఉండే స్టిల్ తో పాటు హీరోయిన్స్ తో ఉన్న స్టిల్స్ కూడా ఉంచారు.

స్టేట్ రౌడీరాష్ట్రంలోని రౌడీల భరతం పట్టేందుకు రౌడీగా మారిన యువకుని పాత్రలో చిరు కనిపిస్తే.. ఫ్యాన్స్ మాత్రం ఆయన నటనకు బ్రహ్మరధం పట్టారు. సూపర్ హిట్ చేశారు. బి. గోపాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా టైటిల్ రూపకల్పనే చాలా క్రియేటివ్ గా ఉంటుంది. చార్మినార్ పైన నిలబడిన చిరు తో ఉన్న లోగో అదరహో అనిపించింది.

బావగారు బాగున్నారా !మెగాస్టార్ రొమాంటిక్ కామెడీ మూవీ బావగారు బాగున్నారా చిత్రం చెప్పగానే మనందరికీ ముందుగా గుర్తు వచ్చేది అందులో చిరు వేసుకున్న చెక్స్ ప్యాయింట్. ఆ ప్యాయింట్ తో చిరంజీవి నైస్ గా కూర్చున్న ఫోజు ని సినిమా టైటిల్ లో ఉంచి హిట్ కొట్టారు.

చూడాలని ఉందిగుణశేఖర్, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి మూవీ “చూడాలని ఉంది”. మెగాస్టార్ యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్ లు ఈ చిత్రాన్ని హిట్ దిశగా నడిపించాయి. ఇందులోని “యమహా నగరి” పాటలో చిరు స్టిల్ ని ఈ మూవీ టైటిల్ ముందు ఉంచి ఆకర్షణ తీసుకొచ్చారు.

రౌడీ అల్లుడుమాస్ ప్రేక్షకుల మనసుదోచుకున్న చిరంజీవి చిత్రం రౌడీ అల్లుడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు మెగా ఫోన్ నుంచి వచ్చిన మరో బ్లాక్ బస్టర్. ఆటోడ్రైవర్ జానీ, బిజినెస్ మాన్ కళ్యాణ్ గా చిరు ద్విపాత్రాభినయం చేసి కేక పుట్టించారు. ఈ చిత్రం టైటిల్ లోగోలో నోటీలో సిగరెట్, చేతిలో మందు గ్లాసుపట్టుకుని మాస్ లుక్ తో ఉన్న చిరుని చూడవచ్చు.

డాడీతండ్రి కూతుళ్ల అనుబంధంపై అల్లుకున్న కథ డాడీ. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలోని కథాంశం తెలిసేలా పాపతో నడుచుకుంటూ వస్తున్న చిరు చిత్రాన్ని టైటిల్లో పెట్టారు. ఈ చిత్రం మహిళా ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది.

మృగరాజుమెగాస్టార్ స్టార్ ఇమేజ్ కి దూరంగా ఎంచుకున్న సినిమా మృగరాజు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టైటిల్లో చిరంజీవి సింహాన్ని వేటాడే ఫోజులో కనిపిస్తారు. మరో వైపు సింహం ఉంటుంది. ఇలా టైటిల్ ల్లోనే కథను, ప్రధాన పాత్రను తీరును వివరించారు.

‘ఇంద్ర’చిరు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ‘ఇంద్ర’ ఒకటి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ ల్లోనూ చిరు డ్యాన్సింగ్ ఫోజు ఉంటుంది. కాశీలో ఉన్న లుక్ తో లోగో ఉంటుంది. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది.

శంకర్ దాదా ఎంబీబీస్దాదా గా ఎదిగిన వ్యక్తి డాక్టర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చాలా ఫన్నీగా జయంత్ సి. పరాంజీ… శంకర్ దాదా ఎంబీబీస్ సినిమాలో చూపించారు. బాలీవుడ్ మూవీ మున్నాభాయ్ ఎంబీబీస్ కి ఇది రీమేక్ అయినప్పటికీ ఇందులో చిరు తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. ఈ సినిమా టైటిల్ లో చేతిలో గన్, మేడలో స్కెతస్కోప్ తో స్టైల్ గా నిల్చొని ఉన్న చిరు లోగో సినిమాపై ఆసక్తిని పెంచడానికి ఓ కారణమయింది.

జై చిరంజీవమేన కోడలిని చంపిన వారిని అంతమొందించే మేనమామ కథతో రూపొందిన చిత్రం జై చిరంజీవ. విజయ్ భాస్కర్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా యాక్షన్, ఎమోషన్ తో చిరంజీవి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ మూవీ టైటిల్లో చిరు సాంగ్ లో ఉండే ఫోజు ఉంటుంది.

శంకర్ దాదా జిందాబాద్ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం శంకర్ దాదా జిందాబాద్. 2007 లో వచ్చిన ఈ చిత్రంలో గాంధేయవాదిగా చిరు అలరించారు. ఈ చిత్రం టైటిల్లో మెగాస్టార్ చాలా స్టైల్ గా ఉంటారు. ఆ లుక్ సినిమాలోని ఓ పాట నుంచి తీసుకున్నారు.

ఖైదీ నంబర్ 150మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నప్పటికీ తనకి కలిసి వచ్చిన సెంటిమెంట్ ని ఫాలో అయ్యారు. ఖైదీ నంబర్ 150 మూవీ టైటిల్ ల్లో చిరు నడుచుకుంటూ వస్తున్న లోగో పెట్టించారు. సినిమాలో కీలక సన్నివేశంలోనిది ఈ స్టిల్. ఫస్ట్ లుక్ నాడు రివీల్ అయిన ఈ టైటిల్ అభిమానులకు చాలా చేరువైంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus