ఈ 10 సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ను టైటిల్స్ గా పెట్టారు..!

  • November 8, 2022 / 08:00 AM IST

ఒక చార్ట్ బస్టర్ సాంగ్ ను సినిమా పేరుగా పెట్టడం అనేది కొత్త విషయం కాదు. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ లో ‘ఆరడుగుల బుల్లెట్’ అనే పాట ఉంటుంది. గోపీచంద్ సినిమాకి అదే లిరిక్ ను టైటిల్ గా పెట్టారు. ఆ ఒక్క సినిమానే కాదు ఇంకా చాలా సినిమాలకు ఇదే పద్దతిని ఫాలో అయ్యారు కొంతమంది దర్శకనిర్మాతలు.ఆ పాటల లిరిక్స్ ను టైటిల్స్ గా పెట్టుకుంటే సినిమాకి క్రేజ్ ఏర్పడుతుంది అనేది వారి అభిప్రాయం కావచ్చు. కొంతవరకు అది నిజమే..! ఏ సినిమాకి అయినా క్రేజ్ ఏర్పడాలి అంటే దాని టైటిల్ జనాల మైండ్లో రిజిస్టర్ కావాలి. అందుకే వాళ్ళు కూడా ఈ పద్దతిని ఫాలో అయ్యారు. అలా అని ఈ పద్దతిని ఫాలో అయిన ప్రతీ సినిమా సక్సెస్ అయ్యింది అని కాదు. కానీ అలా వచ్చిన సినిమాల టైటిల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సాహో :

‘బాహుబలి2’ లో ‘సాహోరే బాహుబలి’ అనే పాట ఉంటుంది. ఆ లిరిక్ నే తీసుకుని ప్రభాస్ సినిమాకి ‘సాహో’ అని పెట్టారు. ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది

2) చూసి చూడంగానే :

‘ఛలో’ సినిమాలో చూసి చూడంగానే అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. ఆ లిరిక్ నే శివ కందుకూరి, వర్ష బొల్లమ నటించిన సినిమాకి టైటిల్ గా పెట్టారు.

3) సోలో బ్రతుకే సో బెటర్ :

మని సినిమాలోని భద్రం బి కేర్ ఫుల్ సాంగ్ లోని లిరిక్ ను తీసుకుని సాయి తేజ్ సినిమాకి టైటిల్ గా పెట్టారు.

4) రంగ్ దే :

‘అఆ’ సినిమాలో ‘రంగ్ దే రంగ్ దే’ అనే లిరిక్స్ తో పాట ఉంటుంది. ఆ లిరిక్ నే నితిన్ – వెంకీ కుడుముల సినిమాకి పెట్టారు.

5) సెహరి :

‘ఓయ్’ సినిమాలో ‘సెహరి’ అనే సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది. అదే టైటిల్ ను కొత్త హీరో హర్ష్ కానుమిల్లి సినిమాకి పెట్టారు.

6) ఒకే ఒక జీవితం :

‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో ‘ఒకే ఒక జీవితం’ అనే సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్ నే ‘శర్వానంద్’ సినిమాకి పెట్టారు.

7) ఓరి దేవుడా :

రఘువరన్ బి.టెక్ లో ఓరిదేవుడా అంటూ ఓ పాట ఉంటుంది. ఆ లిరిక్ నే విశ్వక్ సేన్ మూవీకి టైటిల్ గా పెట్టారు.

8) ఉర్వశివో రాక్షసివో :

‘జల్సా’ సినిమాలో ‘గాల్లో తేలినట్టుందే’ పాటలోని లిరిక్ ను తీసుకుని అల్లు శిరీష్, అను ఇమాన్యుల్ సినిమాకి పెట్టారు.

9) ఆరడుగుల బుల్లెట్ :

గోపీచంద్, నయనతార జంటగా నటించిన ఈ మూవీకి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘ఆరడుగుల బుల్లెట్’ సాంగ్ లోని లిరిక్ ను టైటిల్ గా పెట్టారు.

10) సీటీమార్ :

‘దువ్వాడ జగన్నాథం’ సినిమాల్లోని ‘సీటీమార్’ అనే పాటలోని లిరిక్ తో గోపిచంద్- సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన మూవీకి పెట్టారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus