ఈ ఏడాది రిలీజ్ కానున్న సమంత సినిమాలు

క్యూట్ బ్యూటీ సమంత నటించిన ఆరు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ కానున్నాయి. ఇందులో మొదటిగా రంగస్థలం థియేటర్లోకి వస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో తొలిసారి సమంత నటించిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తమిళంలో విశాల్ పక్కన “ఇరుంబు తిరై” సినిమాలో నటించింది. దీనిని తెలుగులో “అభిమన్యుడు”గా అనువదించారు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంత్రి కే రిలీజ్ కావాలి. కానీ పోస్ట్ పోన్ చేశారు. దీనిని కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇక సమంత జమునగా నటించిన సావిత్రి బయోపిక్ “మహానటి” కూడా విడుదల కానుంది. దీనికి గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది.

కంప్లీట్ కాగానే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. మరో మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. డైరక్టర్ త్యాగరాజన్‌ “సూపర్‌ డీలక్స్‌” అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తుండగా, సమంత హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శివ కార్తికేయన్ తో సీమ రాజా అనే మూవీ చేస్తోంది. ఈ రెండింటితో పాటు కన్నడ లో హిట్ సాధించిన “యూ టర్న్” కూడా తెలుగులో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూడు ఈ ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లో సందడి చేయనున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus