2006 లో జనవరి 11న విడుదలైన ‘దేవదాసు’ చిత్రంతో తెరంగేట్రం చేసాడు రామ్ పోతినేని అదే మన ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఈ రోజు రామ్ పుట్టిన రోజు కావడం విశేషం.17 ఏళ్ళకే హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ ను చూసి చాలా మంది హీరోలు భయపడ్డారు. ‘స్రవంతి మూవీస్’ అధినేత రవి కిశోర్.. రామ్ కు స్వయానా పెదనాన్న. పెద్దగా హడావిడి లేకుండా స్టార్ ఇమేజ్ కోసం పరితపించకుండా కూల్ గా తనకు కలిసొచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసుకుంటూ రామ్ ఇప్పటి వరకూ తన కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో ‘రెడీ’ ‘మస్కా’ ‘కందిరీగ’ ‘పండగ చేస్కో’ ‘నేను శైలజ’ ‘హలో గురు ప్రేమకోసమే’ వంటి హిట్లు అందుకున్నాడు. అయితే ఎప్పుడూ అవే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్లు చేస్తున్నాడు అనే విమర్శలు కూడా రామ్ కు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ కొట్టింది. తెలంగాణ మాస్ కుర్రాడిగా రామ్ నటన అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రం కోసం తన లుక్ ను కంప్లీట్ గా మార్చేశాడు రామ్. 6 ప్యాక్ బాడీని కూడా బిల్డ్ చేసాడు. తన 14 ఏళ్ళ కెరీర్లో రామ్ ఓ 3 చిత్రాల్ని కూడా రిజెక్ట్ చేసాడు.
అవేంటంటే… గౌతమ్ మేనన్ డైరెక్షన్లో నాని, సమంత జంటగా నటించిన ‘ఏటో వెళ్ళి పోయింది మనసు ఒకటి కాగా.. మరొకటి ఎన్టీఆర్ – సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘రభస’ చిత్రం మరొకటి. అయితే ఆ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు కాబట్టి అభిమానులు పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. కానీ అనిల్ రావిపూడి – రవితేజ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ ‘రాజా ది గ్రేట్’ ను కూడా రామ్ రిజెక్ట్ చేసాడు. మంచి పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది.. మరి రామ్ ఎందుకు రిజెక్ట్ చేసాడో..!