ప్రతి శుక్రవారం కనీసం మూడు నాలుగు సినిమాలు చూడకపోతే నిద్రపట్టని మూవీ లవర్స్ కి ఈవారం “బ్యాడ్ వీక్” అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈవారం తెలుగు, హిందీ ఇండస్ట్రీస్ నుంచి ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ చిత్రం కూడా విడుదలవ్వడం లేదు. అందుకు “మహానటి” ఎఫెక్ట్ ముఖ్యకారణం అని చెప్పొచ్చు. అయితే.. ఈవారం ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించి నటించిన “అన్నదాతా సుఖీభవ” పలు సమస్యలను ఎదుర్కొన్న అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈవారం తెలుగులో విడుదలవుతున్న ఏకైక స్ట్రయిట్ సినిమా ఇదే. అలాగే.. విజయ్ ఆంటోనీ తాజా చిత్రం “కాశి” కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బేసిగ్గా అతడికి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ.. అతడి మునుపటి చిత్రాలు “యమన్, ఇంద్రసేన” డిజాస్టర్స్ గా నిలవడంతో ఈ సినిమా మీద జనాలకి పెద్దగా ఆసక్తి లేదు. కాకపోతే.. “బిచ్చగాడు” తర్వాత విజయ్ ఆంటోనీ మళ్ళీ మదర్ సెంటిమెంట్ నేపధ్యంలో చేస్తున్న సినిమా కావడంతో హిట్ అయ్యే అవకాశాలున్నాయి.
ఇకపోతే.. ఈవారం బిగ్గెస్ట్ ఫిలిమ్ అంటే “డెడ్ పూల్ 2”. మోస్ట్ హిలేరియస్ సూపర్ హీరో సిరీస్ లో వస్తున్న సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకే మార్వెల్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తోంది. సో, రెగ్యులర్ మూవీ గోయర్స్ దృష్టి వచ్చే వారం మే 25 మీదనే ఉంది.