సూపర్ హిట్ అవుతున్న నిడివి ఎక్కువగా ఉన్న సినిమాలు.!

  • April 25, 2018 / 01:32 PM IST

ఇది స్పీడ్ యుగం… థియేటర్లో ప్రేక్షకులు రెండుగంటలకు మించి కూర్చోలేరు… అందరూ బిజీగా ఉన్నారు… అందుకే సినిమా నిడివి తగ్గించేశాము.. అని కొంతమంది దర్శకనిర్మాతలు చెప్పే మాటల్లో వాస్తవం లేదని తాజా చిత్రాలు నిరూపించాయి. కూర్చోనేవిధంగా సినిమాని తీయగలితే రెండు గంటలు ఏంటి ?  మూడు గంటలు కదలకుండా కూర్చుంటామని సినీ ప్రేక్షకులు చాటిచెప్పారు. రెండు వారాల వ్యవధిలో రిలీజ్ అయినా   ‘రంగస్థలం’, ‘భరత్‌ అనే నేను’ సినిమాల నిడివి దాదాపు మూడు గంటలు. డైరక్టర్లు ఎంత తగ్గించాలని చూసినా ఫీల్ పోతుందని ఈ సినిమాలను రిలీజ్ చేశారు.

ఇవి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలో చేరాయి. 2 గంటల 50 నిముషాల లెన్త్ ఉన్న రంగస్థలం ఇప్పటికే 175 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. భరత్ అనే నేను  నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయ నేపథ్యం అయినా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 125 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్ర బృందాలకు ధైర్యాన్నిచింది మాత్రం అర్జున్ రెడ్డి సినిమానే. విజయ్ దేవర కొండ హీరోగా నటించిన ఈ సినిమా మూడు గంటలు నిడివి ఉంది. అయినా భయపడకుండా డైరక్టర్ సందీప్ రెడ్డి రిలీజ్ చేశారు. అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో వీటిని రిలీజ్ చేశారు. ఈ మూడు సినిమాల ఫలితం మరికొన్ని సినిమాలకు స్ఫూర్తి ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus