తెలంగాణ నేపథ్యం, యాసతో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఏవంటే..?

ఒక సినిమా కథను ఒక ప్రాంతం, దాని నేపథ్యం.. అక్కడి మనుషులు, వారి జీవన విధానాల ఆధారంగా తీర్చిదిద్దుతుంటారు దర్శక నిర్మాతలు.. ప్లేస్, బ్యాక్‌డ్రాప్‌తో పాటు యాస అనేది కూడా చాలా ఇంపార్టెంట్.. అనుకున్నది అనుకున్నట్లు, అందరికీ చేరువయ్యేలా చేయడంలో భాష, యాసలది కూడా ముఖ్యమైన పాత్రే.. అలా తెలంగాణ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలొచ్చాయి.. అన్నీ ప్రేక్షకాదరణ పొందినవే.. ముఖ్యంగా ఆర్. నారాయణ మూర్తి చిత్రాలు, దాసరి నారాయణ (ఒసేయ్ రాములమ్మ – సమ్మక్క- సారక్క) వంటివి ఎన్నో ఉన్నాయి.. ఈ మధ్య కాలంలో అంటే పాండమిక్ తర్వాత తెలంగాణ నేపథ్యం, యాసతో వచ్చి సూపర్ హిట్ అయినవి.. అలాగే ఈ నేపథ్యంలో రాబోతున్న, తెరకెక్కుతున్న సినిమాల వివరాలు చూద్దాం..

1) జాతిరత్నాలు..

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా మెయిన్ లీడ్స్‌గా.. అనుదీప్ కె.వి డైరెక్ట్ చేసిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘జాతిరత్నాలు’.. సంగారెడ్డిలోని జోగిపేట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాండమిక్ తర్వాత సూపర్ హిట్ కొట్టిన ఫస్ట్ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ సాధించడమే కాక ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది..

2) వకీల్ సాబ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో వచ్చిన ‘వకీల్ సాబ్’ (పింక్ రీమేక్) లో పవన్ తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఓ స్టార్ హీరో తెలంగాణ స్లాంగ్ మాట్లాడిన మూవీ ఇదే.. బాక్సాఫీస్ బరిలో మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదసలు..

3) లవ్ స్టోరీ..

నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన బ్యూటిఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ ఫిలిం.. ‘లవ్ స్టోరీ’.. నిజామాబాద్‌లోని ఆర్మూర్ ప్రాంతాన్ని ఎంచుకుని.. కులాల వివక్షత, ప్రేమ, ఆడపిల్లల మీద అఘాయిత్యాల వంటి అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది..

4) డీజే టిల్లు..

‘డీజే టిల్లు’ తో సిద్ధు జొన్నలగడ్డ సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. అతని క్యారెక్టర్‌కి యూత్, ఆడియన్స్ ఫిదా అయిపోయారు.. సగటు తెలంగాణ యువకుడిగా అద్భుతంగా నటించాడు.. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ రాబోతుంది కూడా..

5) ఆర్ఆర్ఆర్ – జూనియర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ లో తారక్.. గోండు బెబ్బులి కొమరం భీమ్‌గా తెలంగాణ యాసలో ఇరగదీసేశాడు. అతని పద ఉచ్ఛారణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..

6) వాల్తేరు వీరయ్య – రవితేజ..

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అన్నదమ్ముళ్లుగా నటించిన మాస్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’.. ఇందులో తెలంగాణ నుండి ట్రాన్ఫర్ అయ్యి వైజాగ్ వెళ్లిన ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్‌లో రవితేజ తెలంగాణ యాసలో డైలాగులు పలికి ఆకట్టుకున్నాడు..

7) బలగం..

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ నటించగా.. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఫిలిం ‘బలగం’.. తెలంగాణ నేపథ్యం, పల్లెటూరి వాతవరణంలో సహజమైన పాత్రలతో.. మానవ సంబంధాలను మనసుల్ని కదిలించేలా చూపించి కంటతడి పెట్టించారు. ఇది చిన్న సినిమా కాదు.. ప్రేక్షకులు మనసులు గెలిచిన సినిమా..

తెలంగాణ నేపథ్యం, యాసతో రాబోతున్న సినిమాలు..

1) దసరా..

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా పక్కా తెలంగాణ నేటివిటీతో మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవనుంది ‘దసరా’.. నాని క్యారెక్టర్, తెలంగాణ డైలాగ్స్, పాటలు సినిమా మీద అంచనాలు పెంచేశాయి.. సినిమా పక్కా హిట్ అనే టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో..

2) దాస్ కా ధమ్కీ..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో, దర్శకుడిగా.. ఓల్డ్ సిటీ నేపథ్యంలో ‘ఫలక్ నుమా దాస్’ లో తెలంగాణ యువకుడిగా అదరగొట్టేశాడు.. తర్వాత పలు సినిమాల్లోనూ ఆ స్లాంగ్ కనిపించినా మరోసారి పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో హీరో కమ్ డైరెక్టర్‌గా ‘దాస్ కా ధమ్కీ’తో మార్చి 22న రాబోతున్నాడు..

3) బాలయ్య – NBK 108..

నటసింహా నందమూరి బాలకృష్ణ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న NBK 108లో బాలయ్య తెలంగాణ నేపథ్యంతో రాబోతున్నట్టు.. తెలంగాణ యాసతో అదరగొట్టబోతున్నట్టు చెప్పారు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus