రిలీజ్ కి సిద్ధమవుతున్న బాహుబలిని మించి పోయే సినిమాలు

తెలుగు వారు మాత్రమే కాదు భారతీయులందరూ గర్వపడేలా చేసిన చిత్రం బాహుబలి కంక్లూజన్. ఈ మూవీ దాదాపు 1800 కోట్లు వసూలు చేసి అత్యధిక కలక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. వసూళ్ళ పరంగా దంగల్ బాహుబలి 2 ని మించినప్పటికీ అనేక రికార్డులు బాహుబలి కంక్లూజన్ పేరిట ఉన్నాయి. ఆ రికార్డులను అధిగమించడానికి అటు బాలీవుడ్, కోలీవుడ్ కష్టపడుతున్నాయి. చివరికీ ఒక్కో పరిశ్రమ ఒక్కో సినిమాతో బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి గురిపెట్టాయి. అవి ఏమిటంటే.. 2 .o , “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్”. తమిళ కమర్షియల్ డైరక్టర్ శంకర్ రోబో కి సీక్వెల్ గా 2 .o తీస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇందులో గ్రాఫిక్స్ ఎలా ఉంటుందో కొన్ని రోజుల క్రితం టీజర్ రూపంలో చూపించారు. సినిమా హాలీవుడ్ వారిని సైతం ఆకర్షించగలదని సినీ విశ్లేషకులు తేల్చి చెప్పారు. అలాగే రజినీకాంత్, అక్షయ్ కుమార్ అభిమానులు దేశవ్యాప్తంగా తక్కువయేమి లేరు.

ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” ట్రైలర్ తోనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. సముద్రంపై యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి డైరక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య అభినందనలు అందుకుంటున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇద్దరూ ఈ సినిమాలో మరోమారు రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న వీరిద్దరూ నటించిన సినిమా అంటే ఓపెనింగ్స్ మామూలుగా ఉండదు. సో 2 .o, “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” సినిమాలు బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అలా పోటీ ఉంటేనే నాణ్యమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus