రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం కంటే ముందు బాలనటుడిగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. చిన్న వయసులోనే సాహసంతో కూడిన యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా చేసి తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 09) మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బాలనటుడిగా మహేష్ నటించిన సినిమాలపై ఫోకస్…
01 . నీడదర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడలో తొలిసారి మహేష్ బాబు నటించారు. అప్పుడు అతని వయసు నాలుగేళ్లు. హీరోగా ఎప్పుడూ చొక్కా విప్పని సూపర్ స్టార్ తొలి చిత్రంలో చొక్కా లేకుండా నటించడం విశేషం.
02 . పోరాటంకొన్నేళ్లు గ్యాప్ తర్వాత మహేష్ తండ్రి కృష్ణ సినిమా “పోరాటం”లో నటించారు. తండ్రి, కొడుకులు అన్నదమ్ములుగా నటించి మెప్పించారు. మహేష్ కళ్ళజోడు పెట్టి చాలా అందంగా కనిపించడంతో పాటు చక్కగా డైలాగులు చెప్పి శెభాష్ అనిపించుకున్నారు.
03 .శంఖారావంసూపర్ స్టార్ తెరకెక్కించిన సినిమాల్లో శంఖారావం ఒకటి. 1987 లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, మహేష్ లు తండ్రి కొడుకులుగా నటించారు. అభిమానులను అలరించారు.
04 . బజారు రౌడీకోదండ రామిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బజారు రౌడీ లో కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా నటించారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో మహేష్ నటించి నవ్వులు పూయించారు.
05 . ముగ్గురు కొడుకులుకృష్ణ తన ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు తో కలిసి చేసిన సినిమా ముగ్గురు కొడుకులు. ఇందులో ముగ్గురూ పోటాపోటీగా నటించి సినిమాని సూపర్ హిట్ చేశారు.
06 . గూడాచారి 117కృష్ణ గూడాచారి 116 గా సూపర్ హిట్ అందుకున్నారు. కొన్నేళ్ల తర్వాత గూడాచారి 117 సినిమా చేశారు. ఇందులో మహేష్ నటనతో పాటు డ్యాన్స్ తో అదరగొట్టారు.
07 . కొడుకులు దిద్దిన కాపురంచిన్నప్పుడే మహేష్ డ్యూయల్ రోల్ చేసి అలరించిన సినిమా కొడుకులు దిద్దిన కాపురం. కృష్ణ, విజయ శాంతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ కొడుకులుగా అద్భుతంగా నటించారు.
08 . బాల చంద్రుడుమీసాలు కూడా రాణి వయసులోమహేష్ టైటిల్ రోల్ పోషించారు. బాల చంద్రుడు సినిమాలో మహేష్ ఫుల్ లెన్త్ రోల్ చేసి ఇక హీరోగా ఎంట్రీ మాత్రమే మిగిలి ఉందని చెప్పారు.
09 . అన్న – తమ్ముడుమహేష్ బాబు బాలనటుడిగా చివరిగా చేసిన చిత్రం అన్న – తమ్ముడు. ఇందులో అన్నగా కృష్ణ నటించగా తమ్ముడి పాత్రను మహేష్ బాబు పోషించారు. 1990 లో వచ్చిన ఈ చిత్రంలో ఒమేగా స్టార్ గా పరిచయం చేసుకున్న మహేష్ .. రాజకుమారుడితో ప్రిన్స్ గా అవతారమెత్తారు.