హిట్ అయిన సినిమా.. అందరికీ నచ్చాలని రూలు లేదు. ఫ్లాప్ అయిన సినిమా ఎవరికీ నచ్చదని చెప్పలేము. అపజయం సాధించిన కొన్ని తెలుగు చిత్రాలు సైతం మన మదిలో మంచి స్థానం సంపాదించుకుంటాయి. వాటిని మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడుతుంటాము. అలా మరిచిపోలేని సినిమాలు ఏంటి.. అందులో నచ్చే అంశం ఏమిటి? అనే దానిపై ఫోకస్…
జగడం సుకుమార్ దర్శకత్వం వచ్చిన జగడం సినిమా చాలా ఎమోషన్ గా సాగుతుంది. ఇందులోని ప్రతి సీన్ కి ఎవరో ఒకరు కనెక్ట్ కావడం ఈ చిత్రం స్పెషల్.
బుజ్జిగాడు పూరి జగన్నాథ్ హిట్ చిత్రాల జాబితాలో చేరాల్సిన మూవీ బుజ్జిగాడు. ఇందులో ప్రభాస్ డైలాగ్ డెలివరీ సూపర్. భారీ కటౌట్ కలిగిన హీరో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంటే సరదాగా అనిపిస్తుంది. అలాగే యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ కేక పుట్టించారు.
నేనింతే వాస్తవాలు వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి ఇబ్బందికరమైన సినీ లైఫ్ గురించి పూరి జగన్నాథ్ బోల్డ్ గా చెప్పడం.. ప్రతి సినీ కళాకారుడికి నచ్చింది. అందరి మదిలో నిలిచి పోయింది.
ఖలేజా మహేష్ బాబులోని కామెడీ టైమింగ్ ని బయటపెట్టిన మూవీ ఖలేజా. సినిమా మొదలు నుంచి చివరి వరకు కథ సీరియస్ గా సాగుతున్నా.. త్రివిక్రమ్ పంచ్ లకు నవ్వు ఆపుకోలేము.
పంజా తమ హీరో ఎలా ఉండాలో?.. సినిమాలో ఎంత సేపు కనిపించాలో.. అలా.. అంతలా పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఉంటారు. అందుకే అతని అభిమానులకు ఈ మూవీ మరిచిపోలేనిది.
వన్ .. నేనొక్కడినే కథ బాగుంది.. డైలాగులు బాగున్నాయ్.. ఫైట్స్ అదిరిపోయాయి.. పాటలు దుమ్మురేపాయి అని చెప్పుకోవడమే తెలిసిన.. సినీ విశ్లేషకులు తొలి సారి స్క్రీన్ ప్లే సూపర్ అని ప్రశంసించిన మూవీ వన్ .. నేనొక్కడినే.
ఆరెంజ్ ఫుల్ లెన్త్ లవర్ బాయ్ గా చరణ్ చేసిన మూవీ ఆరెంజ్. ఇందులో అతని క్యారెక్టర్ ని ఇంతవరకు వచ్చిన ప్రేమకథ చిత్రాల్లో ఏ హీరోకి మ్యాచ్ కానీ విధంగా డైరక్టర్ డిజైన్ చేసి గుర్తుండిపోయేలా చేశారు.
ఊసరవెల్లిఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని పక్కన పెట్టి స్టైలిష్ హీరోగా ఊసరవెల్లి లో పరిచయం చేశారు సురేందర్ రెడ్డి. ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ నటనతో క్లాస్ ఆడియన్స్ ని పెంచుకున్నారు.
ఇలా ప్లాప్ అయినా .. మీకు నచ్చిన సినిమా.. ఉంటే మాతో షేర్ చేయండి.