‘నిర్బంధం’, ‘మాంగల్యం’, ‘పరాక్రమం’ వంటి మూవీలతో తెలుగు ప్రేక్షకులలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో కం డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. తానే తన సినిమాకు హీరో , డైరెక్టర్ , నిర్మాత , ఇదంతా గమనిస్తే తనకి సినిమా పట్ల ఎంత పిచ్చి అభిమానమో సింపుల్ గా అర్ధం అవుతుంది. ఒకానొక సందర్భంలో యూట్యూబ్ లో డైరెక్ట్ గా తన సినిమాని రిలీజ్ చేసి ‘కళ నాది – వెల మీది’ అంటూ సినిమా చూసాక నచ్చిన్నట్టయితే డబ్బులు ఫోన్ పే ద్వారా పంపమని ఒక స్టేట్మెంట్ తో సంచలనం రేపాడు అప్పట్లో.
ప్రస్తుతం బండి సరోజ్, సుమ కొడుకు రోషన్ హీరోగా నటించిన ‘మోగ్లీ’ చిత్రంలో నెగెటివ్ రోల్ లో నటించగా, ఆ మూవీ డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా, అఖండ 2 వాయిదా పడటం డిసెంబర్ 12 కి షిఫ్ట్ అవ్వటంతో మోగ్లీ యూనిట్ తమ సినిమాను ఒకరోజు లేట్ గా డిసెంబర్ 13న విడుదలకు సిద్దమైనది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండి సరోజ్ కూడా హాజరు అయ్యాడు. అతనిని మాట్లాడమని పిలువగా ప్రేక్షకులు ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ స్వాగతం పలకడంతో, సరోజ్ మాట్లాడుతూ ” నాకు ఇలా మాట్లాడటం మొదటి సారి అని, మీరు ఎక్కువగా అరిస్తే నేను ఏడ్చేస్తానని ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ సినిమా అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ కి ధన్యవాదాలు తెలియజేశాడు. మోగ్లీ సినిమాని దర్శకుడు సందీప్ చాలా బాగా డిజైన్ చేశారని ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు అని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా బాలయ్య బాబు అభిమానులు డిసెంబర్ 12 కి సినిమాను విడుదల అయ్యేదాకా పట్టుపట్టి వదల్లేదు అని, వారి అభిమానానికి ఫిదా అయ్యానని, అదేవిధంగా మోగ్లీ మూవీ అఖండ 2 అనే మర్రి చెట్టు పక్కన మొక్కలాంటిది అని బాలయ్య అభిమానులు 4 షోలలో ఒక షో మోగ్లీ ని కూడా చూసి ఈ సినిమాని కూడా హిట్ చెయ్యాలని కోరారు.