సినీ తారలు ఏ చిన్న తప్పు చేసినా పెద్దగా చూడడం అందరికీ అలవాటు అయిపోయింది. మీడియా వాళ్లు దానిని ఫ్లాష్ న్యూస్ గా చేసి.. వ్యూస్ పెంచుకుంటున్నారు. పోలీసులు కూడా సెలబ్రిటీలపైనే ఫోకస్ ఎక్కువగా పెడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గత నెలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కార్ కి నల్ల గ్లాసులు ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు ఆ కార్ డ్రైవర్ కి రూ.700 ల చలాన వేసారు.
ఈ మధ్య మాస్ మాహారాజ్ రవితేజ కారుకి కూడా నల్ల అద్దాలు ఉన్నాయని ఫైన్ రాసారు. ఇలా పరిశీలించే పోలీసుల కళ్లకి నల్ల అద్దాలు కలిగిన ప్రజాప్రతినిధుల కార్లు కనబడడం లేదా అని సోషల్ మీడియా వేదికగా నటుడు బ్రహ్మాజీ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం “సాహసమే శ్వాసగా సాగిపో” ఆడియో వేడుకకు వెళుతుండగా ఓ ఎంపీ కారుకి నల్ల అద్దాలున్న సంగతిని గమనించారు.
వెంటనే తన సెల్ ఫోన్ తో ఆ కారు ఫోటోలను తీసి “నేను సాధారణంగా అడుగుతున్నాను.. నల్ల అద్దాలున్న కార్లలో ఎంపీ ప్రయాణించ వచ్చా? ” అని పోస్ట్ చేశారు. ఆధారాలతో బ్రహ్మాజీ సంధించిన ప్రశ్నకు ట్రాఫిక్ పోలీసులు ఏమని సమాధానం చెబుతారో వేచి చూడాలి.
MP can travel in car with dark glasses..?😳😳
Just asking.. pic.twitter.com/TKp7GaPeH1— BRAHMAJI (@actorbrahmaji) June 17, 2016