మిస్టర్ కెకె

  • July 19, 2019 / 03:33 PM IST

ప్రతి సినిమాకి పతాకస్థాయిలో కష్టపడినప్పటికీ.. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఢీలాపడిన నటుడు విక్రమ్ ఈసారి ప్రయోగంతో కాకుండా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కమల్ హాసన్ నిర్మాణ సారధ్యంలో తమిళంలో రూపొందిన “కదరం కొండాన్” అనే పేరుతొ రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో “మిస్టర్ కెకె”గా అనువదించారు. మరి ఈ చిత్రంతోనైనా విక్రమ్ హిట్ కొట్టగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: ఒక ఇండస్ట్రీలిస్ట్ ను చంపిన కేస్ లో ముఖ్య నిందితుడైన కెకె (విక్రమ్) కారణాంతరాల వలన హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. అదే హాస్పిటల్లో డాక్టర్ గా వర్క్ చేస్తున్న వాసు (అభి హాసన్) ఒకానొక సందర్భంలో కెకె మీద జరిగిన ఎటాక్ ను తిప్పికొడతాడు. ఆ క్రమంలో.. కెకెను హాస్పిటల్ నుండి సేఫ్ గా బయటకు తీసుకురావాలి లేదంటే గర్భవతి అయిన వాసు భార్య అధీరా (అక్షర హాసన్)ను చంపేస్తామని కొందరు వయసును బెదిరిస్తుంటారు. ఈమేరకు ఆమెను కిడ్నాప్ కూడా చేస్తారు.

ఇక చేసేదేమీ లేక కెకెను హాస్పిటల్ నుండి తప్పిస్తాడు వాసు. కానీ తానూ అనుకున్నట్లుగా భార్య అధీరాను తిరిగి దక్కించుకోవడం ఈజీ కాదని గ్రహిస్తాడు వాసు. ఈలోపు కెకెను వెంటాడుతున్నది హత్య కేసులో కాదని.. కెకె దగ్గర ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉందని తెలుసుకొంటాడు వాసు.

ఇంతకీ కెకె దగ్గర ఉన్న కీలకమైన ఇన్ఫో ఏమిటి? వాసు తన భార్యను తిరిగి పొందగలిగాడా? అనేది “మిస్టర్ కెకె” కథ.

నటీనటుల పనితీరు: విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పాలిసింది ఏమీ లేదు. కానీ.. ఈ సినిమాలో ఆయనకీ నటించే స్కోప్ పెద్దగా లేదనే చెప్పాలి. అభి హాసన్, అక్షర హాసన్ లు ఎక్కువ స్క్రీన్ ప్రెజన్స్ షేర్ చేసుకొన్నారు. క్లైమాక్స్ లో గర్భిణిగా అక్షర హాసన్ నటన ఆకట్టుకొంటుంది.

మిగతా నటీనటులందరూ స్టైలిష్ గా కనిపించారు కానీ.. ఎవరి పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ ను ఎస్టాబ్లిష్ చేయలేదు. దాంతో వారి పాత్రలన్నీ సోసోగా ఉంటాయి.

సాంకేతికవర్గం పనితీరు: శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంది. యాక్షన్ బ్లాక్స్ & ఛేజింగ్ సీన్స్ ను భలే ఆసక్తికరంగా తెరకెక్కించారు. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎప్పట్లానే మ్యాజిక్ చేసాడు.

దర్శకుడు రాజేష్ సెల్వ ఆంగ్ల చిత్రం “పాయింట్ బ్లాంక్”ను ఇండియన్ వెర్షన్ కు తగ్గట్లుగా ఎడాప్ట్ చేసుకోవడంలో విఫలమయ్యాడు. విక్రమ్ ను కూడా సరిగా వాడుకోలేకపోయాడు. యాక్షన్ సీన్స్ వరకూ బాగానే తీసాడు కానీ.. ఎమోషన్స్ కానీ టెన్షన్ కానీ క్రియేట్ అవ్వలేదు. దాంతో సినిమా మొదటి నుండి చివరివరకు అలా సాగుతూనే ఉంటుంది తప్పితే ఎంగేజ్ చేయదు. సో, డైరెక్టర్ గా “చీకటి రాజ్యం”తో పర్వాలేదనిపించుకొన్న రాజేష్.. “మిస్టర్ కెకె”తో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

విశ్లేషణ: విక్రమ్ మీద వీరాభిమానంతోపాటు ల్యాగ్ ను భరించే సహనం కూడా ఉంటేనే “మిస్టర్ కెకె”ను థియేటర్లో చూడగలరు. పాపం.. విక్రమ్ కి కమర్షియల్ హిట్ కొట్టాలన్న కల మాత్రం నెరవేరలేదు.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus