ప్రేమనగర్ లో మిస్టర్ మజ్ను వీరవిహారం

అఖిల్ నటిస్తున్న మూడో చిత్రానికి “మిస్టర్ మజ్ను” అనే టైటిల్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోయినా ఫిక్స్ చేసేశారని వినికిడి. ఈ సినిమాలో అఖిల్ పాత్రను 1971 వ సంవత్సరంలో వచ్చిన ఏఎన్నార్ ప్రేమ్ నగర్ సినిమాలోని ఆయన పాత్రను స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేశారట. “ప్రేమ్ నగర్” సినిమాలో ఏఎన్నార్ రోల్ కి, ఈ “మిస్టర్ మజ్ను”లో అఖిల్ రోల్ కి చాలా పోలికలు ఉంటాయట. అఖిల్ చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలు తిరుగుతుంటారని.. ఈ పాత్ర భలే ఫన్ క్రియేట్ చేస్తుందని సినిమా యూనిట్ చెబుతుండగా.. ఈ చిత్రం లండన్ షెడ్యూల్ పూర్తి కావచ్చిందని త్వరలోనే యూనిట్ హైద్రాబాద్ లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రంపై అఖిల్ బాబు చాలా ఆశలు పెట్టుకొన్నాడు. మొదటి చిత్రం “అఖిల్” డిజాస్టర్ అవ్వడం, రెండో సినిమా “హలో”లో నటించినప్పటికీ అది కమర్షియల్ హిట్ కాదు దాంతో అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడం కష్టమే అని గుసగుసలు వినబడ్డ తరుణంలో “తొలిప్రేమ” వంటి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం చేస్తుండడంతో ఈ మూడో చిత్రంతోనైనా అఖిల్ ఫేట్ మారి హిట్ కొడతాడా లేదా అని అక్కినేని అభిమానులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus