‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ నిర్మించిన తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. అఖిల్ అక్కినేని హీరోగా.. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్ అందించిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జనవరి 25 న విడుదల కాబోతోంది. ‘సవ్యసాచి’ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ‘యూ/ఎ’ సర్టిఫికెట్ ను జారీ చేసారు. ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్లే సెన్సార్ బోర్డు ‘యూ/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. ఈ చిత్రం చాలా బాగుందని, అఖిల్ చాలా బాగా నటించాడని, చాలా గ్లామర్ గా కనిపించాడని.. సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించారని సమాచారం. సినిమాకు సెకండాఫ్ ప్రధాన బలమని తెలుస్తుంది. చివరి 45 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుందట.
అందులోనూ చివరి 15 నిమిషాలు అయితే ప్రేక్షకుడిని విశేషంగా ఆకట్టుకుంటుందని వారు చెప్పుకొస్తున్నారు. ఈ 15 నిమిషాల ఎపిసోడ్ సినిమాకు ప్రాణమని…. కుటుంబ బంధాలు, వారి మధ్య ప్రేమలను తెలియజెప్పే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని… వెంకీ అట్లూరి మరోసారి తన సున్నితమైన దర్శకత్వ ప్రతిభతో కచ్చితంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. అంతేకాదు నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయట. తమన్ మ్యూజిక్ లో తెరకెక్కిన పాటలు.. అలాగే నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వచ్చిందట. అయితే కామెడీకి పెద్ద ప్రాధాన్యత లేకపోవడం…, అలాగే క్లాస్ గా సాగే ప్రేమకథ కాబట్టి మాస్ ప్రేక్షకులకి నచ్చకపోవచ్చని మైనస్ పోయినట్లుగా చెబుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ మరియు పాటలకి మంచి స్పందన లభించింది. ‘అఖిల్’ ‘హలో’ చిత్రాలతో నిరాశ పరిచిన అఖిల్.. ఈ చిత్రంతో హిట్టందుకోవడం ఖాయమని వారు చెబుతున్నారు.