మిస్టర్ మజ్ను రిలీజ్ డేట్ మళ్ళీ మారింది

అక్కినేని కుటుంబానికి కలిసి వచ్చే ప్రేమకథతో అఖిల్ “మిస్టర్ మజ్ను” అనే సినిమాని చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం లండన్లో షూటింగ్ జరుపుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. దేవదాస్ మనవడో.. మన్మధుని వారసుడో అంటూ సాంగ్స్ తో స్టార్ అయిన ఈ వీడియో అందరికీ నచ్చింది. కొత్త లుక్ తో అఖిల్ అదరగొట్టాడు. ఈ సినిమా షూటింగ్ ఈనెలలో కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా కంప్లీట్ చేసి నాగార్జునకు కలిసి వచ్చే డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు కూడా.

అయితే అదే రోజు వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’, శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’ తో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలవుతుండండంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న కి వాయిదా వేశారు. అప్పుడు కూడా బాలకృష్ణ “ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రం పోటీకి వస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేస్తే బాగుంటుందని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus