Mrunal Thakur: స్టార్‌ స్టేటస్‌ వెనుక కష్టం గురించి చెప్పిన మృణాల్‌ ఠాకూర్‌!

టాలీవుడ్‌లో మోస్ట్‌ డిస్కష్‌డ్‌ హీరోయిన్ల లిస్ట్‌ రాస్తే.. అందులో కచ్చితంగా ఉండే పేరు మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur). తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా, ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నది ఒక్క సినిమానే అయినా ఆమె గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా మీద ఆమె చూపించిన ప్రభావం అలాంటిది. అలాగే ఆమె నటిస్తోంది అంటూ వార్తలొస్తున్న సినిమాలు అలాంటివి. వాటికి తోడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫొటోలు, అందులో ఆమె చూపించి హొయలు, అందాలు ఆ మాత్రం చర్చ జరిగేలా చేస్తున్నాయి.

అయితే సోషల్‌ మీడియాలో, ఇండస్ట్రీలో ఆమె గురించి అంతగా చర్చ జరుగుతుంటే ఆమె మాత్రం సినిమాలకు దూరంగా రెస్ట్‌ తీసుకుంటోంది. అవును, ఇప్పుడు మృణాల్‌ రెస్ట్‌ మోడ్‌లో ఉంది. అంతేకాదు అలా ఎందుకు మోడ్‌ ఛేంజ్‌ చేసిందో కూడా వివరించింది. సింపుల్‌గా చెప్పాలంటే చక్కగా, ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఆమె ఇప్పుడు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. గతేడాది ఆరు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మృణాల్‌ ఈ ఏడాదిలోనూ మంచి ఛాన్స్‌లే కొట్టేసింది. అయితే కొత్త సినిమాలు పట్టాలెక్కేలోపు రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లింది.

బిజీగా ఉండే మృణాల్‌ ఇప్పుడు ఇలా ఎందుకు అని అడిగితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం చెప్పింది. వేగంగా పరిగెడుతున్న ఈ సినీ ప్రయాణంలో సరదాగా కొన్ని రోజులు కుటుంబంతో సమయం గడపడం, ప్రయాణాలు చేయడం ఎంతో ముఖ్యమనిపించింది అందుకే గ్యాప్‌ ఇచ్చాను అని చెప్పింది. గత రెండేళ్లుగా తీరిక లేకుండా పనిచేశానని, మంచి నిద్రకోసం ఆరాట పడిన రోజులు కూడా అందులో ఉన్నాయని చెప్పింది మృణాల్‌. అందుకే ఇప్పుడు ముంబయిలో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నానని తెలిపింది.

బిజీ లైఫ్‌ విరామాలు ముఖ్యం. కుటుంబంతో గడిపే సమయానికి చాలా విలువుంటుంది. నైపుణ్యాలను, సినిమాలను ఎంచుకునే ఆలోచన విధానాల్ని ఈ టైమ్‌లో ఇంప్రూవ్‌ చేసుకోవచ్చు. లేదంటే తొందరపడి ఏదో ఓ సినిమా ఓకే చేసేసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే ఈ రెస్ట్‌ అని చెప్పింది మృణాల్‌.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus