బాలీవుడ్ బుల్లితెరపై పలు సీరియల్స్ నటిస్తూ అనంతరం హీరోయిన్గా అవకాశాలు అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న తరుణంలో తనకు సీతారామం సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమాలో సీత పాత్రలో నటించినటువంటి ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి కానీ బలమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈమెకు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి అంచలంచలుగా ఎదుగుతున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా నెపోటిజం గురించి వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి తాజాగా (Mrunal Thakur) ఈమె కూడా నెపోటిజం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ఒక అవార్డు వేడుకకు ఈమె హాజరయ్యారట. ఈ అవార్డు వేడుకలో భాగంగా ఈమెను మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు అదే సమయంలోనే అక్కడికి ఒక స్టార్ కిడ్ రావడంతో వెంటనే మీడియా వాళ్ళందరూ కూడా తనని వదిలి అతనిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారని తెలిపారు.
ప్రతి ఒక్కరు నెపోటిజం విషయంలో స్టార్ కిడ్స్ ని నిందిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నెపోటిజం అనేది స్టార్ కిడ్స్ తప్పు కాదు అన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్టార్ కిడ్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు అందుకే మీడియా వాళ్ళు కూడా వారిని ఇంటర్వ్యూ చేస్తున్నారని ఈమె తెలిపారు. ఇక ఈ కామెంట్ల పై పలువురు స్పందిస్తూ.. నెపోటిజాన్ని ఎంకరేజ్ చేసేది ఆడియన్స్, మీడియానే అంటూ ఈ వార్తలపై కామెంట్లు చేస్తున్నారు.