Hero Nani,Mrunal Thakur: నానితో మృణాల్ ఠాకూర్.. అదే కారణమా?

డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమా ఇటు థియేటర్లోనూ అలాగే డిజిటల్ మీడియాలో కూడా భారీ విజయం సొంతం చేసుకోవడంతో ఈ సెలబ్రిటీలకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా కూడా రాబోతుందని నిర్మాత అశ్వినీ దత్ పేర్కొన్న విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన కూడా మృణాల్ ఎంపికయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా ఈ విధంగా ఈమె గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సీతమ్మ నేచురల్ స్టార్ నానితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే మృనాల్ నానిని కలవడం వెనుక గల కారణం ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు మొదలయ్యాయి. నాని హను రాఘవపూడి దర్శకత్వంలో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో నటించారు. అయితే తాజాగా ఈ హీరోయిన్ నానిని కలవడంపై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఫోటో పై స్పందించిన కొందరు నానితో కలిసి మృణాల్ ఏదైనా సినిమా చేయబోతున్నారా అందుకే తనని కలిసిందా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ కూడా రానున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం నాని దసరా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus