Mrunal Thakur: మృణాల్‌తో మాట్లాడాలంటే చిన్న నిర్మాతలు భయపడుతున్నారా?

ఒక్క సినిమా హిట్‌ కొడితే చాలు.. రెమ్యూనరేషన్లు ఇట్టే పెంచేస్తారు మన హీరోయిన్లు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, క్రేజ్‌ ఉండగానే డబ్బులు సంపాదించుకోవాలి అనే డైలాగ్‌ కూడా చెబుతారు. తాజాగా టాలీవుడ్‌లో ఇలాంటి పనే చేస్తున్న కథానాయిక మృణాల్‌ ఠాకూర్‌. బాలీవుడ్‌ నుండి తెలుగులోకి ‘సీత’గా వచ్చిన మృణాల్‌ను డేట్స్‌ కోసం రెడీ అవుతున్న నిర్మాతలకు చిన్నపాటి షాక్‌ తగులుతోంది అని అంటున్నారు. కారణం ఆమె అడుగుతున్న రెమ్యూనరేషనే అని చెబుతున్నారు.

బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసి, మంచి విజయం అందుకున్న మృణాల్‌ ఠాకూర్‌ ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. చూడటానికి పద్ధతిగా కనిపించినా.. అవసరమైనప్పుడు హాటీగా మారడానికి కూడా సిద్ధమవుతుంది. కపిల్‌ శర్మ స్టైల్‌లో చెప్పాలంటే లిప్‌ టు లిప్‌తో ఆక్సిజన్‌ ఇచ్చే సన్నివేశాలకూ ముందుకొస్తుంది. దీంతో తెలుగు నిర్మాతలకు మృణాల్‌లో స్టార్‌ హీరోయిన్‌ కనిపించింది. ఇంకేం ఆలస్యం క్రేజ్‌ను వాడేద్దామని కొంతమంది నిర్మాతలు హీరోయిన్‌ ఆఫర్లు ఇద్దామని చూస్తే భారీ ధర పలుకుతోందని టాక్‌.

‘సీతారామం’ విజయంలో మృణాల్‌ పాత్ర చాలానే ఉన్న విషయం తెలిసిందే. సీతామహాలక్ష్మి పాత్రకు ఆమె ప్రాణం పోసింది అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలో ఆమెకు వరుస ఆఫర్లు వస్తుండటం కూడా తెలిసిందే. ఒకటి, రెండు సినిమాలు దాదాపు ఓకే చేసుకున్న మృణాల్‌కు.. ఇంకా ఆఫర్లు వస్తున్నాయట. ఈ క్రమంలో ఆమెకు ఏకంగా రూ. కోటి అడుగుతోందని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. బాలీవుడ్‌ భామ కాబట్టి అడిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

తెలుగులో స్టార్‌ హీరోయిన్ల కొరత ఎలాగూ ఎప్పుడూ ఉంటుంది. కొత్త భామ వచ్చేసరికి స్టార్ హీరోయిన్‌ స్లాట్‌ ఒకటి రెడీగా ఉంటుంది. మన హీరోలు, వారి ఫ్యాన్స్‌ కూడా కొత్త భామను చూపించడానికి, చూడటానికి రెడీగా ఉంటారు. ఈ క్రమంలో మృణాల్‌ కోసం స్టార్ల మాటామంతీ సాగుతోందట. ఈ క్రమంలో ఆమెను తమ సినిమాల్లోకి తీసుకుందాం అనుకుంటున్న చిన్న నిర్మాతలకు ఇప్పట్లో ఆమె అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా అంత చెల్లించే పరిస్థితి నిర్మాతల దగ్గర ఉండదు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus