మొన్నామధ్య సుమంత్… హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పెళ్లి చేసుకోబోతున్నట్టు గాసిప్స్ వినిపించాయి. ‘సీతా రామం’ సినిమాలో మృణాల్ తో కలిసి నటించాడు సుమంత్. ఆ సినిమా టైమ్లోనే వీళ్ళు ప్రేమలో ఉన్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది.
అందుకు సుమంత్ కూడా ‘అనగనగా’ సినిమా టైమ్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది వట్టి గాసిప్పే అని.. బేస్ లెస్ రూమర్ అని కొట్టిపారేశాడు. తర్వాత ధనుష్ తో మృణాల్ డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది.
అయితే సుమంత్ తో వచ్చిన పెళ్లి రూమర్స్ పై ఆమె స్పందించింది లేదు. ఆ గాసిప్ ని అంతా మర్చిపోయారు. అయితే ఇటీవల జరిగిన ‘డెకాయిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమంత్ తో కలిసి కనిపించింది మృణాల్ ఠాకూర్. దీంతో మళ్ళీ పాత రూమర్లు పుంజుకుంటాయేమో అని భయపడినట్టు ఉంది. సుమంత్ ని అన్నా అంటూ పిలిచి ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసింది. తాజాగా జరిగిన ‘డెకాయిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమంత్ ‘సీతా రామం’ సినిమా గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
అదేంటంటే.. ‘సీతా రామం’ క్లైమాక్స్ లో రామ్ పాత్ర చనిపోతుంది. దీంతో సీత(మృణాల్) పాత్రకి క్షమాపణలు చెబుతూ లాస్ట్ లో ఓ సన్నివేశం ఉంటుందట. కానీ కొన్ని కారణాల వల్ల దానిని డిలీట్ చేశారట. అందువల్ల సుమంత్.. మృణాల్ ఠాకూర్ కి క్షమాపణలు తెలుపుతూ.. ‘ఆ సినిమా రిగ్రెట్ తోనే మృణాల్ కి ‘డెకాయిట్’ లో ఛాన్స్ ఇప్పించినట్టు తెలిపాడు.ఆ తర్వాత మృణాల్ కూడా సుమంత్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఈ క్రమంలో ఆమె సుమంత్ అన్నా… మీ క్షమాపణను స్వీకరిస్తున్నాను.’సీతా రామం’ లో ‘రామ్'(దుల్కర్ సల్మాన్) పాత్ర ప్రభావం నాపై చాలా ఉంది. అది ఒక్క సినిమాతో తీరిపోయేది కాదు.అందుకే సుమంత్ నిర్మాణంలో లేదా కొలబొరేషన్లో మరో మూడు సినిమాలు సైన్ చేయాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి సుమంత్ తో వచ్చిన పెళ్ళి రూమర్స్ కి క్లారిటీ ఇచ్చే క్రమంలో పనిలో పనిగా అతన్ని ‘అన్నా’ అని కూడా పిలిచేసింది మృణాల్.
‘సుమంత్ అన్నా’.. అంటూ పలికిన మృణాల్ ఠాకూర్#AdiviSesh #MrunalThakur #Dacoit pic.twitter.com/N12zNQfgOH
— Filmy Focus (@FilmyFocus) April 7, 2026