Mrunal Thakur: సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లను అలా చూస్తారా.. మృణాల్ ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మృణాల్ ఠాకూర్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో మృణాల్ ఠాకూర్ అభిమానులకు మరింత దగ్గర కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే తాజాగా ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీతారామం సినిమాతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న ఈ బ్యూటీ హీరోయిన్లను కొంతమంది సాధారణ జనాలలా చూడరని అన్నారు.

హీరోయిన్లను ఒక వస్తువును చూసిన విధంగా చూస్తారని ఆమె కామెంట్లు చేశారు. కొంతమంది ప్రత్యేకంగా హీరోయిన్ల శరీర భాగాలపై దృష్టి పెట్టి ఫోటోలను జూమ్ చేసి మరీ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తారని మృణాల్ ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతుండగా మృణాల్ కు చేదు అనుభవాలు ఎదురయ్యాయని అందుకే ఆమె ఇలా చెబుతున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సీతారామం సక్సెస్ తో తెలుగులో మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ పెరిగింది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం తెలుగులో ఈ బ్యూటీకి తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మృణాల్ ఒకవైపు హిందీ సినిమాలలో నటిస్తూనే మరోవైపు తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మృణాల్ కు టైర్1 హీరోలకు జోడీగా అవకాశాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఒకప్పుడు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. మృణాల్ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే టైర్1 హీరోయిన్ల జాబితాలో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది. మృణాల్ (Mrunal Thakur) కథ నచ్చితే గ్లామర్ రోల్స్ లో నటించడానికి సైతం సిద్ధంగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus