Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

‘సీతా రామం’తో తెలుగు వారి మనసులు దోచిన మృణాల్ ఠాకూర్, ఇప్పుడు బాలీవుడ్‌లో మాత్రం నెటిజన్ల ట్రోలింగ్‌తో సతమతమవుతోంది. దీనికంతటికీ కారణం.. అనుష్క శర్మపై మృణాల్ ఎప్పుడో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవ్వడమే.ఈ వీడియో క్లిప్‌తో ఆమెపై బాలీవుడ్ ఆడియన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

Mrunal Thakur

విషయం ఏంటంటే.. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ‘సుల్తాన్’లో హీరోయిన్‌గా అనుష్క కంటే ముందు మృణాల్‌నే అనుకున్నారు. అయితే ఆ అవకాశం చేజారింది.దీని గురించి మృణాల్ మాట్లాడుతూ, “ఒకవేళ నేను ఆ సినిమా చేసి ఉంటే నన్ను నేను కోల్పోయేదాన్ని. అయినా, ఆ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు, నేను అయితే చేస్తున్నాను.

ఇదే నా విజయంగా భావిస్తాను” అంటూ అనుష్క పేరు ప్రస్తావించకుండా చెప్పుకొచ్చింది. దీంతో అనుష్క ఫ్యాన్స్ ఇప్పుడు ఆమెపై మండిపడుతున్నారు. ‘ఇలా మరొక నటిని తక్కువ చేసి మాట్లాడటం ‘మీన్ గర్ల్’ ప్రవర్తన’ అంటూ నెటిజన్లు మృణాల్ ని విమర్శిస్తున్నారు. ‘సుల్తాన్’ తర్వాత అనుష్క నిర్మాతగా మారి ఎన్నో సక్సెస్‌ఫుల్‌ ఫిల్మ్స్ తీసిందని, ఆమె ఖాళీగా లేదంటూ మృణాల్‌కు కౌంటర్లు ఇస్తున్నారు.గతంలో ‘బిగ్ బాస్’ షోలో సల్మాన్ ఖాన్ స్వయంగా ‘సుల్తాన్’కు హీరోయిన్ గా మృణాల్ ఫస్ట్ ఛాయిస్ అని చెప్పడం జరిగింది. ఏదేమైనా మృణాల్ ఠాకూర్ మాట్లాడే ముందు కొంచెం అలోచించి మాట్లాడితే బెటర్ అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. అనుష్క శర్మకి స్టార్ స్టేటస్ ఉంది. కాబట్టి స్టార్స్ గురించి మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్త వహించాలి.

13 ఏళ్ళ తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus