Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » మెగా హిట్ చిత్రాల రారాజు ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’

మెగా హిట్ చిత్రాల రారాజు ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’

  • May 10, 2021 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హిట్ చిత్రాల రారాజు ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’

ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ విజయాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగానూ గత ఏడాది ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.

ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. దీనికి నిర్మాతలుగా సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ ‘7 డేస్ 6 నైట్స్’ సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుడుతున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. కొంత హైదరాబాద్… మరికొంత గోవా, మంగుళూరు, అండమాన్ నికోబర్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. ‘డర్టీ హరి’తో తన సత్తా చూపించిన నాన్నగారు, మరో విభిన్నమైన జానర్ లో ఈ సినిమా చేయనున్నారు” అని అన్నారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ “యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. సంగీతం, ఇతర సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తాం. గత ఏడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసలు మరువలేనివి. చాలామంది పెద్దవాళ్ళు నేను గొప్పగా తీశానని మెచ్చుకున్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ‘డర్టీ హరి’కి నాకు అండగా నిలబడి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నిర్మాత గూడూరు శివరామకృష్ణగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రానికి కూడా ఆయన వెన్నంటే ఉంటారు. ‘డర్టీ హరి’ని మించి ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, పబ్లిసిటీ: ఈశ్వర్ అందే, సెకండ్ యూనిట్ డైరెక్టర్స్: అశ్విన్ కశ్యప్, యువి సుష్మ, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #7 Days 6 Nights Movie
  • #MS Raju

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

9 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

9 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

11 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

12 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

12 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version