Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » రెగ్యులర్ షూటింగ్‌లో ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ‘7 డేస్ 6 నైట్స్’

రెగ్యులర్ షూటింగ్‌లో ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ‘7 డేస్ 6 నైట్స్’

  • June 28, 2021 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెగ్యులర్ షూటింగ్‌లో ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ‘7 డేస్ 6 నైట్స్’

ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘మస్కా’ , ‘ఆట’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ విజయాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగానూ గత ఏడాది ‘డర్టీ హరి’తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా ట్రెండీగా, అదే విధంగా యువతకు చక్కటి సందేశాన్నిస్తూ కొత్తగా ఉందని పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా ఎంఎస్ రాజు ప్రతిభను అందరూ ప్రశంసించారు. ‘డర్టీ హరి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’.

ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. ఈ నెల 21(సోమవారం) హైదరాబాద్ లో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమాతో పదిహేనేళ్ల కుర్రాడు ‌ సమర్థ్ గొల్లపూడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పాటలు, నేపథ్య సంగీతం చాలా కొత్తగా, అల్ట్రా మోడ్రన్‌గా ఉండాలనే ఉద్దేశంతో అతడిని తీసుకున్నారు. ప్రస్తుత అగ్ర సంగీత దర్శకులలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంఎస్ రాజుగారు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ .ఎం మాట్లాడుతూ “జూన్ 21న హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. జూలై 10 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్ నికోబర్ దీవుల్లో నెల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేశాం. సెప్టెంబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాం. ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ‘డర్టీ హరి’ తర్వాత దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుట్టారు. సాంకేతిక పరంగానూ ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది” అని అన్నారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ “ఇదొక కూల్ అండ్ న్యూఏజ్ ఎంటర్టైనర్. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో నటీనటుల వివరాల్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచాం. తర్వాత వాళ్లు ఎవరనేది వెల్లడిస్తాం. కథ పరంగా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాలి. అందుకు తగ్గట్టు పక్కా ప్రణాళిక వేసుకుని, చిత్రీకరణ మొదలుపెట్టాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. ‘డర్టీ హరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. నిర్మాతగా, దర్శకుడిగా… నేనెప్పుడూ ఒకదానికి, మరొకదానికి పొంతన లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాను. ‘డర్టీ హరి’ ఓ జానర్ సినిమా.‌ ‘7 డేస్ 6 నైట్స్’ కూల్ ఎంటర్టైనర్. ఇందులో వినోదానికి మంచి అవకాశం ఉంది. లవ్, ఎమోషన్స్ ‌కి చక్కటి ఆస్కారం ఉంది. సంగీతానికి సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉంది. పాటలు కొత్తగా ఉంటాయి” అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #7 Days 6 Nights Movie
  • #MS Raju

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

10 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

10 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

14 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

14 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

21 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

12 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

13 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

13 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

14 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version