‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు టాలీవుడ్లో రూపొందిన 10 మల్టీస్టారర్లు… మరియు వాటి ఫలితాలు!

  • March 26, 2022 / 06:53 PM IST

నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వర రావు,శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి ఒకప్పటి స్టార్ హీరోలు ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. వాటిలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. కొన్ని క్లాసిక్స్ గా నిలిచాయి.అయినప్పటికీ సమఉజ్జీలు కలిసి మల్టీస్టారర్లు చేశారు అనే మంచి పేరుని వారు సంపాదించుకోవడంతో పాటు అభిమానుల మధ్య చిచ్చు పెట్టారు అనే అపవాదుని కూడా వారు మూటగట్టుకున్నారు.అలాంటి వాటిని చూసేనేమో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల వంటి సీనియర్ స్టార్ హీరోలు.. వాళ్ళ పోటీదారులతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు.

అయితే వెంకటేష్ మాత్రం ప్రజెంట్ జనరేషన్ స్టార్ హీరోలతో అలాగే యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఆయన దారిలో చాలా మంది హీరోలు అడుగులు వేశారు. అయితే ఇటీవల ఎన్టీఆర్- చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ అనే మల్టీస్టారర్ చేశారు.రాజమౌళి దీనికి రూపకర్త. ఈ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందో మనం చూస్తున్నాం.భవిష్యత్తులో స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేసే అవకాశం ఉందనే ఆశని కలిగించాయి. అయితే ఈ దశాబ్దంలో అంటే గత 10 ఏళ్ళలో టాలీవుడ్లో రూపొందిన మల్టీస్టారర్లు ఏంటి? వాటి ఫలితాలు ఏంటి అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు :

వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరో, మహేష్ బాబు వంటి ప్రజెంట్ స్టార్ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

2) మసాలా :

యంగ్ హీరో రామ్ తో కలిసి వెంకటేష్ చేసిన ఈ మల్టీస్టారర్ మూవీ ‘బోల్ బచ్చన్’ కు రీమేక్. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది.

3) మనం :

నాగార్జున- నాగ చైతన్య కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీకి విక్రమ్ కె కుమార్ దర్శకుడు. అక్కినేని నాగేశ్వర రావు గారు కూడా ఈ మూవీలో నటించారు. ఆయనకి ఇదే చివరి మూవీ. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

4) గోపాల గోపాల :

వెంకటేష్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ కు డాలి దర్శకుడు. ‘ఓ మై గాడ్’ అనే బాలీవుడ్ మూవీకి ఇది రీమేక్. అక్కడ హిట్ అయ్యింది కానీ ఇక్కడ మాత్రం యావరేజ్ గా మిగిలింది.

5)ఊపిరి :

నాగార్జున- కార్తీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ను వంశీ పైడిపల్లి డైరెక్ చేసాడు. ఫ్రెంచ్ మూవీ ఇంటచబుల్స్ కు రీమేక్ గా అనేక మార్పులతో ఈ మూవీ తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

6) దేవదాస్ :

నాగార్జున- నాని కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ను శ్రీరామ్ చంద్ర డైరెక్ట్ చేసాడు. ఈ మూవీ అంచనాలను మ్యాచ్ చేయలేక ప్లాప్ అయ్యింది.

7) ఎఫ్ 2 :

వెంకటేష్- వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

8) వెంకీ మామ :

వెంకటేష్- నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ను బాబీ డైరెక్ట్ చేసాడు. ఈ మూవీ కూడా మంచి హిట్ అయ్యింది.

9) బంగార్రాజు :

నాగార్జున- నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ డీసెంట్ హిట్ అనిపించుకుంది.

10) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ను సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది.

11) ఆర్.ఆర్.ఆర్ :

ఎన్టీఆర్ – చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ మల్టీస్టారర్ ను రాజమౌళి తెరకెక్కించాడు. నిన్న విడుదలైన ఈ మూవీ ఎపిక్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

వీటితో పాటు చిరు- చరణ్ ల ‘ఆచార్య’,బాబీ దర్శకత్వంలో చిరు- రవితేజ ల మల్టీస్టారర్, చిరు- సల్మాన్ ల ‘గాడ్ ఫాదర్’.. వంటి మల్టీస్టారర్లు కూడా రూపొందుతున్నాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus