Bigg Boss Non-Stop: అఖిల్ తో కలిసి ముమైత్ మంతనాలు దేనికి చేస్తోందో తెలుసా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ స్టార్ట్ అయ్యింది. హౌస్ మేట్స్ 17మంది ఎవరికి వాళ్లు స్ట్రాటజీలని వాడుతున్నారు. అంతేకాదు, కొంతమంది కామ్ గా సిట్యువేషన్ కోసం చూస్తుంటే, మరికొంతమంది ఎంటర్ టైన్మెంట్ ఇస్తూ స్క్రీన్ స్పేస్ కోసం చూస్తున్నారు. నిజానికి ఓటీటీలో 24గంటలు లైవ్ వస్తున్నప్పుడు అందరికీ బాగానే స్క్రీన్ స్పేస్ అనేది దొరుకుతుంది. ఇక జూనియర్స్, సీనియర్స్ కలబోతగా వచ్చిన హౌస్ మేట్స్ లో ముమైత్ ఖాన్ అప్పుడే నామినేషన్స్ గురించి వర్రీ అవుతోంది.

ఇదే విషయాన్ని ఆర్జే చైతూని సీక్రెట్ గా పిలిచి మరీ అడిగింది. దీనికి ఆర్జే చైతూ లైట్ తీస్కోమని, సిట్యువేషన్ వచ్చినపుడు నామినేట్ చేయమని చాలా పద్దతిగా కూల్ గా చెప్పాడు. అయినా కూడా ముమైత్ ఖాన్ టెన్షన్ తగ్గలేదు. ఇప్పుడు సడెన్ గా నామినేషన్స్ పెడితే ఎలా అంటూ అఖిల్ ని స్మోక్ జోన్ కి పిలిచి మరీ అడిగింది. దీంతో అఖిల్ మొత్తం 17మంది మనకి సింక్ అవ్వాలని రూల్ లేదని, అందులో కొంతమంది అప్పుడే కనెక్ట్ అవ్వరని దానిని బట్టీ స్ట్రాటజికల్ గా ఆలోచించి చేయమని చెప్పాడు. అంతేకాదు, తన గేమ్ నచ్చకపోయినా తనన్ని కూడా నామినేట్ చేసేయాలని చెప్పుకొచ్చాడు. నిజానికి ముమైత్ ఖాన్ పార్టిసిపేట్ చేసిన సీజన్ 1లో నామినేషన్స్ గురించి బయటకి ప్రస్తావించకూడదు. కానీ, ఇప్పుడు గత రెండు సీజన్స్ గా ఓపెన్ గానే అందరూ మాట్లాడుకుంటున్నారు.

అంతేకాదు, నామినేషన్స్ ని నెక్ట్స్ లెవల్ కి తీస్కుని వెళ్లారు. ఒకసారి ఒక పార్టిసిపెంట్ ని నామినేట్ చేసిన తర్వాత వాళ్లు వెళ్లిపోతుంటే బాధపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకునే ఒక గ్రూప్ నుంచీ నాకు వైబ్రేషన్స్ రావట్లేదు అంటూ ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది. అఖిల్ ఒక టాస్క్ ఆడితే మొత్తం నీకే క్లారిటీ వచ్చేస్తుందని, నా మైండ్ సెట్ ని బట్టీ నేను గేమ్ ఆడతాను, నువ్వు కూడా అలాగే ఆడు అంటూ సలహాలు ఇచ్చాడు. దీన్ని బట్టీ చూస్తే ఈ సీజన్ లో వీరిద్దరూ త్వరగానే కనెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అదీ విషయం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus